* చైనా, రష్యాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూపొందిస్తున్న కొవిడ్-19 టీకాలను కొనుగోలు చేసేందుకు అమెరికా సుముఖంగా లేదని సమాచారం. విస్తృతంగా క్లినికల్ ట్రయల్స్ జరపకుండానే ముందుగానే మార్కెట్లో విడుదల చేసే ఈ వ్యాక్సిన్లతో ప్రమాదమని భావిస్తోంది. అవి సురక్షితమో కాదో తెలియదని ఆందోళన చెందుతోంది.కరోనా వైరస్ ప్రభావం దశాబ్దాల వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కొవిడ్-19 ప్రపంచ మహమ్మారిగా ప్రకటించి ఆరు నెలలు కావడంతో ఆ సంస్థ అధినేత డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రియేసస్ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాల స్థాయిలో పారదర్శకంగా లేని ఔషధ నియంత్రణ సంస్థలున్న దేశాల టీకాలను తాము వాడటం కష్టమేనని అమెరికా అంటు వ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోని ఫౌచి అన్నారు.‘ఇతరులకు విక్రయించేందుకు అనుమతులు పొందేముందు వ్యాక్సిన్‌ను చైనా, రష్యా విస్తృతంగా పరీక్షిస్తాయనే అనుకుంటున్నా. పరీక్షించకుండానే టీకాలను సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. అలా చేస్తే సమస్య కచ్చితంగా మరింత జటిలం అవుతుంది’ అని ఫౌచి మీడియా సమావేశంలో అన్నారు. కాగా సొంతంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఫార్మా దిగ్గజాలు సనోఫి, గ్లాక్సోస్మిత్‌కెలైన్ (జీఎస్‌కే)కు 2.1బిలియన్ డాలర్లు చెల్లించిన సంగతి తెలిసిందే.
* రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కన్నుమూతసమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కన్నుమూశారు. చాలా రోజులుగా ఆయన సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2013లో ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడి కోలుకుని 2016లో తిరిగి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.
* రాజధాని అమరావతిపై రెఫరెండం నిర్వహించాలని, వైకాపా ప్రజాప్రతినిధులకు రహస్య ఓటింగ్ పెట్టాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. అమరావతి విషయంలో సీఎం జగన్ ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. కీలకమైన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో దిల్లీలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
* సుదూర ప్రయాణాలు చేసేందుకు పేద, మధ్య తరగతి వర్గాలు ఉపయోగించే ఏకైక రవాణా సాధనం రైలుబండి. ఆంక్షలు ఉండటంతో ప్రస్తుతం తక్కువగానే రైళ్లు నడుస్తున్నాయి. అయితే రైలులో ప్రయాణించినప్పుడు కొవిడ్-19 సంక్రమించే ముప్పు శాతం ఎంత? ఎన్ని గంటలు కూర్చుకుంటే ఎంతమేర ఉంటుంది? ఒక్కొక్కరి మధ్య ఎంత దూరం పాటిస్తే క్షేమం? ప్రయాణించే కాలం ఎంత పెరిగితే ముప్పు రేటు ఎంత పెరుగుతుంది? వంటి అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత కొరవడింది. అయితే చైనా వ్యాధి నియంత్రణ కేంద్రానికి చెందిన కొందరు పరిశోధకులు దీనిపై అధ్యయనం చేసి క్లినికల్ ఇన్‌ఫెక్షియస్ జర్నల్‌లో ప్రచురించారు.
* రెండు టీఎంసీల కోసం కాళేశ్వరానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో జూమ్ యాప్ ద్వారా మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు ప్రస్తుత సామర్థ్యం 44 వేల క్యూసెక్కులన్నారు. 44వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. పోతిరెడ్డిపాటు అంశంలో సీఎం కేసీఆర్ సరైన రీతిలో స్పందించట్లేదని విమర్శించారు. పోతిరెడ్డిపాటు సామర్థ్యం పెంచితే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయమని ఆవేదన చెందారు. పోతిరెడ్డిపాటు సామర్థ్యం పెంచితే తెలంగాణ ఆరు టీఎంసీలు నష్టపోతుందని పేర్కొన్నారు. నాగార్జున సాగర్, పాలమూరు ఎత్తిపోతల, కల్వకుర్తికి చుక్కనీరు రాదని ఆక్షేపించారు. ఈ నెల 11న పోతిరెడ్డిపాటు టెండర్లు ఆహ్వానించినట్లు తమకు సమాచారం ఉందన్నారు. టెండర్లు పూర్తి కావాలనే సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా వేయాలన్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు పనులు మొదలైతే కేసీఆర్ రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
* మూడు రాజధానుల అంశంపై ఆదివారం జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపు అత్యవసరంగా సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, మూడు రాజధానులపై టెలీకాన్ఫరెన్స్‌లో నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. రాజధాని రైతులకు జనసేన తరఫున ఎలా అండగా ఉండాలన్న దానిపై చర్చించనున్నట్లు సమాచారం. జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
* హిందూస్థాన్ షిప్ యార్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదన్నారు. క్రేన్ ఆపరేషన్, మేనేజ్‌మెంట్‌లో మొత్తం మూడు కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయని చెప్పారు. ప్రమాద కారణాల కోసం కమిటీ ఏర్పాటుకు హెచ్‌ఎస్‌ఎల్ ఛైర్మన్‌ను కోరామన్నారు. హెచ్‌ఎస్ఎల్ ప్రమాదంపై రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏయూ మెకానికల్ ఇంజినీరింగ్ నిపుణులతో కమిటీ, ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగం నుంచి కమిటీ వేస్తామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.
* భాజపా నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు(59) కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్న ఆయన విజయవాడలో శనివారం తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడిన మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితమే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు విడిచారు.
* జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్‌లో తెరాస ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ భేటీ అయ్యారు. తెరాస జిల్లా కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ‘కరోనా వేళ పార్టీ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ కోరారు.
* విశాఖలోని హిందూస్థాన్ షిప్‌యార్డులో జరిగిన ఘోర ప్రమాదం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు.
* అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 5న జరిగే కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ భూమి పూజ చేయనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతారనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఎంతగానో కృషి చేసిన భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషికి ఇంకా ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.
* దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్నిరాష్ట్రాలూ దిల్లీ మోడల్‌ను అనుసరించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని టిమ్స్, గాంధీ ఆస్పత్రి, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్ ఆస్పత్రులను సందర్శించి కరోనా బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టెస్టింగ్, ట్రేసింగ్; ట్రీట్‌మెంట్‌పై దృష్టిపెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
* భారత దేశం ప్రస్తుతం కరోనా వైరస్‌తో సతమతమవుతోంది. రోజుకు వేలాది కేసులు నమోదవుతుండగా, వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే విషయంపై టీమ్‌ఇండియా మాజీ సారథి, ప్రస్తుత ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ప్రస్తుతానికైతే ఆటగాళ్లు సురక్షితంగానే ఉన్నారని, అయితే…..అక్టోబర్‌లో దేశవాళి క్రికెట్ తిరిగి ప్రారంభమైనప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుందని ద్రవిడ్ హెచ్చరించాడు.
* కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో పూర్తిగా స్తంభించిన వాహన విక్రయాలు క్రమంగా కోలుకుంటున్నాయి. జులై నెలలో దాదాపు అన్ని సంస్థల అమ్మకాలు పుంజుకున్నాయి. తాజాగా మారుతీ సుజుకీ ఇండియా విక్రయాల్లోనూ భారీ వృద్ధి నమోదైనట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జులైలో 1,08,064 యూనిట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది. కొవిడ్‌కు ముందు నమోదైన విక్రయాలతో పోలిస్తే ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.
* రాజధాని అమరావతిపై రెఫరెండం నిర్వహించాలని, వైకాపా ప్రజాప్రతినిధులకు రహస్య ఓటింగ్ పెట్టాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. అమరావతి విషయంలో సీఎం జగన్ ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. కీలకమైన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో దిల్లీలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
* మూడు రాజధానుల అంశంపై ఆదివారం జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపు అత్యవసరంగా సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, మూడు రాజధానులపై టెలీకాన్ఫరెన్స్‌లో నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. రాజధాని రైతులకు జనసేన తరఫున ఎలా అండగా ఉండాలన్న దానిపై చర్చించనున్నట్లు సమాచారం.