కొత్తగా వ్యాయామం ప్రారంభించేవారు మొదట్లోనే పెద్దపెద్ద కసరత్తులు ప్రయత్నించవద్దు. మొదట అయిదు నుంచి పదినిమిషాలపాటు నడక, అయిదు నిమిషాలపాటు వ్యాయామాలు చేయాలి. తర్వాత ఆ సమయం పెంచుకుంటూ వెళ్లాలి. వ్యాయామానికి కావాల్సిన పరికరాలను అందుబాటులో పెట్టుకోవాలి. వాటి ఉపయోగం, మరమ్మతుల గురించి ముందే తెలుసుకోవాలి. వ్యాయామానికి అనువైన, సౌకర్యవంతమైన బూట్లను ఎంపిక చేసుకోవాలి. ఖరీదు ఎక్కువని ఆలోచించవద్దు.. సౌకర్యంగా ఉంటేనే ఎక్కువ సేపు వ్యాయామం చేయగలుగుతారు. లేదంటే కండరాలు పట్టేసే ప్రమాదం ఉంది. ఏ వ్యాయామం చేయడానికైనా ముందు కాసేపు వార్మప్ చేయడం తప్పనిసరి. ఇది మీ కండరాలను చురుగ్గా మారుస్తుంది.
వ్యాయామానికి ముందు సరైనా బూట్లు కొనుక్కోండి
Related tags :