* శ్రీకాకుళం జిల్లాలో 3,847 బెడ్లు 23 వెంటిలేటర్లువిజయనగరం జిల్లాలో 1,258 బెడ్లు, 15 వెంటిలేటర్లువిశాఖపట్నం జిల్లాలో 4,456 బెడ్లు 207 వెంటిలేటర్లుతూర్పు గోదావరి జిల్లాలో 1,813 బెడ్స్, 60 వెంటిలేటర్స్పశ్చిమ గోదావరి జిల్లాలో 1,369 బెడ్స్,15 వెంటిలేటర్లు.కృష్ణా జిల్లాలో 1,736 బెడ్స్, 117 వెంటిలేటర్స్గుంటూరు జిల్లాలో 1,496 బెడ్స్, 186 వెంటిలేటర్స్ప్రకాశం జిల్లాలో 114 బెడ్స్, 96 వెంటిలేటర్లునెల్లూరు జిల్లాలో 1073 పడకలు, 167 వెంటిలేటర్లు,అనంతపురం జిల్లాలో 1854 బెడ్లు,16 వెంటిలేటర్లు,చిత్తూరు జిల్లాలో 3,002 బెడ్లతో పాటు 122 వెంటిలేటర్లుకడపలో 385 బెడ్స్, 52 వెంటిలేటర్లు,కర్నూలు జిల్లాలో 2,335 బెడ్స్ తో పాటు 95 వెంటిలేటర్లు
* బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అభిమానులకు శుభవార్త! అమితాబ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. చివరిగా నిర్వహించిన కరోనా టెస్టులో ఆయనకు నెగెటివ్ వచ్చింది. దాంతో అమితాబ్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారని వివరించారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అభిషేక్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. తన విషయం గురించి చెబుతూ, ఇతర లక్షణాల కారణంగా తాను కొంతకాలం ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోందని మరో ట్వీట్ లో తెలిపారు. ఇప్పటికీ తనకు కరోనా పాజిటివ్ అనే వస్తోందని వివరించారు.
* జైలులో..72 మందికి కరోనా..పాజిటివ్.. ఖైదీలలో కల కలం..!నెల్లూరుజిల్లా కేంద్ర కారాగారంలో మరో 20 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకింది.రెండు రోజులుగా కారాగారంలో సంజీవని బస్సు ద్వారా ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా తొలిసారి నిర్వహించిన పరీక్షల్లో 52 మందికి సోకినట్లు నిర్ధరించారు.మలి పరీక్షల్లో 20 మందికి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దీంతో మొత్తం 72 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చిందని జైలుసూపరింటెండెంట్ రాజేశ్వరరావు తెలిపారు.కరోనా సోకిన వారిని ప్రత్యేక ఐసోలేషన్ గదులు కేటాయించినట్లు పేర్కొన్నారు.కారాగారం మొత్తం రసాయనాన్ని చల్లించినట్లు తెలిపారు.
* ప్రకాశం జిల్లా కురిచేడు శానిటైజర్ ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరుకుంది.చికిత్స పొందుతూ కాకాణి గురవయ్య అనే రిక్షా కార్మికుడు మృతి చెందాడు.మరోవైపు మరణాలపై సమగ్ర దర్యాప్తుకు ఆరుగురు పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.దర్యాప్తు బృంద అధికారిగా మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరిని నియమించారు.గ్రామంలో శానిటైజర్ తాగే 200 మందిని అధికారులు గుర్తించారు.ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేని 40 మందిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు.రోజురోజుకు పెరుగుతున్న మరణాలతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది.
* తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ
* కరోనా వైరస్ సోకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూచన మేరకు స్వీయ గృహనిర్బంధంలో ఉన్న వారు కొన్ని మందులు వాడాలని జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్ సూచించారు.
* తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రిమ్స్ ఐసోలేషన్ కేంద్రం నుంచి కరోనారోగులు పరారైన సంఘటన కలకలం రేపుతోంది. ఒకవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరుగుగుండగా, మరోవైపు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న 10మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు శనివారం రాత్రి తప్పించుకుని బయటకు వచ్చారు.ఇటీవల ఈ రిమ్స్‌లో సరైన సౌకర్యాలు లేవని సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాజిటివ్ వచ్చిన పదిమంది సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకున్నారు. అయితే వీరిని రిమ్స్ సెక్యూరిటీ గార్డులతో పాటు ఎప్పటికప్పుడు సిబ్బంది, వైద్యబృందం పర్యవేక్షించాల్సి ఉండగా వారు పట్టించుకోకపోవడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. రిమ్స్ నుంచి తప్పించుకున్న బాధితులు కైలాస్‌నగర్, చాందా, టీచర్స్ కాలనీ, నిజామాబాద్, కొత్త కుమ్మరివాడ, ద్వారక నగర్, ఇంద్రవెల్లి, ఖానాపూర్‌కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.