* రాజమండ్రి సెంట్రల్ జైలు లో కరోనా కలకలంతాజా గా 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణఇప్పటివరకు సెంట్రల్ జైలు లో 52 మందికి కరోనా పాజిటివ్సెంట్రల్ జైలు లో మొత్తం 1670 ఖైదీలు, 200 మంది సిబ్బందిజైలు లో ఉన్న 28 మంది ఖైదీలకు, 24 మంది జైలు సిబ్బందికి కరోనా పాజిటివ్కొత్తగా 10 మంది ఖైదీ లకు కరోనా పాజిటివ్ నిర్ధారణఇంకా 900 పరీక్షల రిపోర్ట్ పెండింగ్కరోనా పాజిటివ్ సోకిన ఖైదు లకు కివిడ్ ఆసుపత్రుల్లో కొనసాగుతున్న చికిత్సకరోనా సోకిన సిబ్బందిలో కొందరు ఆసుపత్రుల్లో మరికొందరు హోమ్ ఇసిలేషన్ లో చికిత్సకరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైల్ లో మూలాఖత్ నీపివేసిన అధికారులు
* దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపెడుతోంది. నిత్యం దాదాపు 800 మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 904 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 24గంటల్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. గురువారం నాటికి దేశవ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య 40,699కు చేరింది. గడిచిన నెలరోజుల్లో దేశవ్యాప్తంగా 20వేల కరోనా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఇక పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా మరో 56,282 కేసులు బయటపడ్డాయి. రోజువారీ అత్యధిక కేసుల్లో ఈ సంఖ్యది రెండోసారి. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకిన వారిసంఖ్య 19,64,536కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 13లక్షల 28వేల మంది కోలుకోగా మరో 5లక్షల 95వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 67శాతం ఉండగా, మరణాల రేటు 2.09శాతంగా ఉంది.ఇదిలా ఉంటే, ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. మరణాల్లో మాత్రం ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది.
* దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి.ఈ క్రమంలో కరోనా లాక్‌డౌన్ సమయంలో పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బంది పడుతున్న గిరిజన రైతులకు వాల్‌మార్ట్ ఫౌండేషన్ అండగా నిలిచింది.చింతపల్లి ఏరియాలో పండించే పసుపు పంటకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా, ఇక్కడ పండే పసుపులో మందుల తయరీకి ఉపయోగించే కర్కుమిన్ 5 నుంచి 7 శాతం ఉండటంతో గిరాకీ అధికంగా ఉంటుంది.కాగా.. లాక్‌డౌన్ సమయంలో ఈ పంటను విక్రయించుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతుండటంతో టెక్నో సెర్వ్ అనే లాభాపేక్ష లేని సంస్థ సహకారంతో వాల్‌మార్ట్ ఫౌండేషన్ ఈ పంటలను కొనుగోలు చేసి ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు విక్రయించే విధంగా ఏర్పాట్లు చేసింది.
* కోవిడ్ టెస్టుల్లో రకాలు..* ప్రతిఒక్కరూ తెలుసు కోవాల్సిన అంశంRT-PCR Test: ఈ పరీక్షని మీ ముక్కు లేదా గొంతులోని స్వాబ్ తీసి పరీక్షిస్తారు. ఫలితం రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ అనే అర్ధం. నెగిటివ్ వస్తే 99% నెగిటివ్ అని అర్ధం.Rapid – Antigen Test: ఈ పరీక్ష కూడా స్వాబ్ ద్వారానే పరీక్షస్తారు. కానీ ఫలితం 15 నిమిషాల్లో తెలుస్తుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ అనే అర్ధం. నెగిటివ్ వచ్చి, కోవిడ్ లక్షణాలు తగ్గకపోతే తప్పకుండా RT-PCR టెస్ట్ చేయించుకోవాలి.Anti Body Test: ఈ పరీక్షని రక్త నమూనాలను సేకరించి చేయడం జరుగుతుంది. ఫలితం ఒక రోజు లోపే వస్తుంది. దీని ద్వారా వచ్చే ఫలితం సరి అయినది కాదు. కావున క్రియాశీల COVID ని నిర్ధారించడానికి యాంటీబాడీ పరీక్షను ఎప్పుడూ చేయించుకోకండి.గమనిక: బయట ప్రైవేట్ గా కొంత మంది యాంటీ బాడీ టెస్టులు చేస్తున్నారు. దీని వలన సరి అయినా కోవిడ్ ఫలితం తెలియదు. అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకండి.
* గడిచిన 24 గంటల్లో ఇండియాలో 56,282 కొత్త కరోనా కేసులు904 కరోనా పాజిటివ్ మరణాలు..ఇండియాలో మొత్తం 19,64,537కి చేరిన కరోనా కేసులు..ఇండియాలో ఇప్పటి వరకు 40,699 కరోనా మరణాలు..ఇండియాలో యాక్టివ్ కేసులు 5,95,501…డిశ్చార్జ్ అయిన కేసులు 13,28,337