తాగేవాళ్లచేత ఆ అలవాటును మాన్పించడం ఓ పట్టాన సాధ్యం కాదు. అయితే రకరకాల మందులూ, చికిత్సల వల్ల కాని పని ప్రేమకు కారణమైన ఆక్సీటోసిన్ హార్మోన్‌తో సాధ్యమవుతుంది అంటున్నారు అమెరికాలోనే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కి చెందిన పరిశోధకులు. ప్రేమకీ ఆనందానికీ కారణమైన ఆక్సీటోసిన్ సామాజిక బంధానికీ ప్రత్యుత్పత్తికీ కూడా తోడ్పడుతుందని గుర్తించారు. దాంతో నేసల్ స్ప్రే రూపంలో ఆక్సీటోసిన్‌ను ఇవ్వడం వల్ల అది ఓ మత్తులా పనిచేస్తుందట. ఫలితంగా మత్తుమందులూ ఆల్కహాల్ జోలికి వెళ్లరని సదరు పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు కొందరిని ఎంపికచేసి వాళ్లు ప్రతిరోజూ ఆక్సీటోసిన్ నేసల్ స్ప్రేను పీల్చేలా చేశారట. దీనివల్ల వాళ్లలో ఆల్కహాల్ తాగాలన్న కోరిక క్రమేణా తగ్గిపోయినట్లు గుర్తించారు. దీన్నిబట్టి- తాగుడు వ్యసనానికి గురయిన వాళ్లు ప్రేమలో పడటం లేదా ఆటలాడటం వంటివి అలవాటు చేసుకోగలిగితే అందులో వచ్చే కిక్‌తో ఆనందాన్ని పొందగలుగుతారు, తద్వారా తాగాలన్న కోరికా క్రమంగా పోతుంది అంటున్నారు పరిశోధకులు.
తాగుడు అలవాటు మానాలంటే ప్రేమ హార్మోన్లతో సాధ్యం
Related tags :