హెచ్-1బీ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. ఆ వీసాలకు సంబంధించిన నిబంధనల్లో స్వల్ప సడలింపులు ఇచ్చారు. దానిలో భాగంగా వీసా నిషేధం కంటే ముందు చేసిన ఉద్యోగాల్లోకి తిరిగి వచ్చే వీసాదారులు అమెరికాలోకి ప్రవేశించడానికి అనుమతిస్తామని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. వీసాదారులతో పాటు వారిపై ఆధారపడిన భాగస్వాములు, పిల్లలు కూడా వెంట రావచ్చని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ స్పష్టం చేసింది. అలాగే హెచ్1బీ వీసాలు కలిగి ఉన్న సాంకేతిక నిపుణులు, ఉన్నత స్థాయి మేనేజర్లు, ఇతర విభాగాల్లో విధులు నిర్వర్తించే వారికి యూఎస్ అనుమతినిచ్చింది. ఈ నిర్ణయం అమెరికా తక్షణ, నిరంతర ఆర్థిక పునరుద్ధరణకు దోహదం చేస్తుందని పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయిన తరుణంలో ట్రంప్ జూన్ 22న హెచ్-1బీ, ఎల్ 1 వీసాలతో వలసేతరులు ప్రవేశించడాన్ని నిషేధించారు. కాగా, ఆ దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలైన ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. మరోవైపు..మహమ్మారిని ఎదుర్కోవడానికి వీసాదారులైన ప్రజారోగ్యం, వైద్యరంగానికి చెందిన నిపుణులు, పరిశోధకులు అమెరికా రావడానికి అనుమతించిన సంగతి తెలిసిందే.
మనసున్న మారాజు…ట్రంప్!
Related tags :