పాక్ క్రికెట్ జట్టు మాజీ సారథి, ప్రస్తుత ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వల్లే దేశంలో క్రికెట్ నాశనమైందని మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ఆరోపించాడు. పాక్ క్రికెట్ బోర్డులో ఉన్న అధికారులకు ఆటలో ఓనమాలు సైతం తెలియవని విమర్శించాడు. ఆటగాళ్లకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. యూట్యూబ్ ఛానల్ ద్వారా మియాందాద్ మాట్లాడాడు. ‘పీసీబీలోని ఒక్క అధికారికీ క్రికెట్‌లో ఓనమాలు తెలియవు. ప్రస్తుత బాధాకర పరిస్థితుల గురించి ఇమ్రాన్‌తో నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను. దేశానికి సరికాని వాళ్లను వదిలిపెట్టను. విదేశాల నుంచి ఓ వ్యక్తి (వసీమ్ ఖాన్)ని తీసుకొచ్చారు. దోచుకొని పారిపోతే అతడిని మీరు పట్టుకోగలరా? పాక్‌లో ఎంతోమంది ఉండగా అతడే కావాల్సి వచ్చాడా? దేశ పౌరులు ఎదగాలి. నిజంగా మెరుగైన వ్యక్తులు లభించకపోతేనే బయటకు చూడాలి. కానీ అలా జరగడం లేదు’ అని మియాందాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అతగాడి వలనే మేము మట్టిలో కలిశాము
Related tags :