* విజయవాడ నోవాటెల్ హోటల్ దగ్గర దారుణం జరిగింది. కారులో ముగ్గురు ఉండగానే దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వేణుగోపాల్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వివాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
* కర్నాటక రాష్ట్ర, పెద్ద కూర్మం గ్రామంకు చెందిన 13 మంది గ్రామస్తులు తెలంగాణ రాష్ట్రంలోని పసుపుల గ్రామం, నారాయనపేట్ జిల్లా కు తెప్ప మీద వచ్చే క్రమంలో భారీ వర్షాల కారణంగా, నీటి ప్రవాహం అధికంగా వుండడంతో తెప్ప తిరగబడడం వలన 13 మంది గల్లంతయ్యారు. అక్కడే వున్న తెలంగాణ మత్స్యకారులు శ్రీపాద, ఆది, లింగమ్మ, నర్సింహులు అందులోని 9 మంది అనగా పుట్టి అంజిలప్ప, దలపతి, నాగప్ప, బుద్దన్న, తిమ్మన్న, నాగేశ్, మోహన్, విష్ణు మరియు అంజిలమ్మలను సురక్షితంగా రక్షించి, వారి గ్రామానికి నారాయణ్ పేట్ ఋడో ఇతర అధికారుల సహకారంతో తరలించడం జరిగింది.
* రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాద ఘటనపై ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ రమేష్ బాబు కోర్టును అశ్రయించారు. రమేష్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. అనంతరం తదుపరి విచారణను జిల్లా కోర్టు ఈ నెల 21కు వాయిదా వేసింది. కాగా స్వర్ణ ప్యాలెస్‌లో రమేష్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది.
* సోమాలియాలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. సోమాలియా రాజధాని మొగదిషులోని ఓ హోటల్‌పై దాడులకు దిగారు. ఈ దాడిలో కనీసం 17 మంది చనిపోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు. తొలుత హోటల్ ముందు కారుబాంబు పేల్చి.. లోపలకి ప్రవేశించారు. తరువాత హోటల్ లో ఉన్న పౌరులను బందీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భద్రతాబలగాలు హోటల్ చట్టుముట్టాయి. సుమారు పది మందిని కాపాడగా.. ఇంకా చాలా మంది పౌరులు లోపలే చిక్కుకున్నారు. ఉగ్రవాదులు బందించిన వారిలో యువకులు, మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. హోటల్‌పై అల్‌ఖైదా అనుబంధ అల్-షబాబ్ సంస్థకు చెందినవారు దాడికి పాల్పడ్డారని తెలుస్తుంది.