మారుతున్న జీవన విధానం ఆధారంగా మనిషి అలవాట్లు మారుతున్నాయి. అలవాట్లతో పాటుగా మనిషి ఆరోగ్యం కూడా మారిపోతున్నది. చిన్న పిల్లలకు సైతం గుండె నొప్పితో బాధపడుతున్నారు. ఇతర జబ్బులు ఇబ్బందులు పెడుతున్నాయి. శరీరంలోని రక్తనాళాల్లో అవరోధం ఏర్పడితే అది బ్రెయిన్ స్ట్రోక్ కు దారితీస్తుంది. ఫలితంగా మనిషి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఈ ముప్పు నుంచి బయటపడాలి అంటే కొన్ని రకాల ఆహార అలవాట్లు మార్చుకోవాలి. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా పాలు, పెరుగు, జున్ను, పండ్లు వంటి పదార్ధాలను యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన రక్తనాళ్లలో రక్తం గడ్డకట్టకుండా ఉంటుందని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెప్తున్నారు. 9 దేశాల్లో నాలుగు లక్షలమంది ఆహార అలవాట్లను, ఆరోగ్యాన్ని పరిశీలించిన తరువాత ఈ విషయాలను తెలియజేశారు పరిశోధకులు.
బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండాలంటే…
Related tags :