ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హైస్కూలు విద్యార్థుల కోసం స్కూలు బ్యాగులు అందజేశారు. అమెరికా పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం పాఠశాలలు ప్రారంభించాక అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో తానా ఆధ్వర్యంలో స్కూలు బ్యాగులు పంపిణీ చేస్తారు. రెండు దశాబ్దాల నుండి జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆగష్టు 20 నాడు డౌనింగ్ టౌన్ లోని లార్డ్స్ పాంట్రీకు వంద స్కూలు బ్యాగులు, ఇతర స్కూలు వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తానా కార్యదర్శి పొట్లూరి రవి, మిడ్ అట్లాంటిక్ సహాయక కమిటీ చైర్ గోపి వాగ్వాల పాల్గొన్నారు. అపర్ణ వాగ్వాల ఆధ్వర్యంలోని హెచ్ టూ సి (హెల్ప్ కేర్ కంఫర్ట్) సంస్థ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేసింది. కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఫిలడెల్ఫియా ప్రాంతంలోని మూడు స్కూలు పాంట్రీలకు సహాయం చేసినట్లు, ఫుడ్ బ్యాంకులకి ప్రతి నెల ఆహారపదార్థాలు అందిస్తున్నట్లు, తానా ఫిలడెల్ఫియా యువ విభాగం వాలంటీర్లు, ఇతర దాతలు వివిధ రకాల కార్యక్రమాల ద్వారా విరాళాలు అందిస్తున్న వారికి తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ధన్యవాదాలు తెలిపారు.
పెన్సిల్వేనియా పేద విద్యార్థులకు తానా బ్యాగుల విరాళం
Related tags :