Movies

హమ్మయ్య…నిలకడగా ఎస్పీబీ!

హమ్మయ్య…నిలకడగా ఎస్పీబీ!

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి తెలిపింది. ఈ మేరకు తాజాగా హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. ఆయన కరోనాతో పోరాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఎక్మో సహాయంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు తెలిపారు.  ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్యం నిలకడగా ఉందని…  మా వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు.  ఎస్పీబీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నామని  తెలిపారు.