‘అల వైకుంఠపురములో’ వంటి భారీ హిట్ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా పతాకాలపై వై. నవీన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయిక. కాగా సుకుమార్ చిత్రాల్లో ప్రత్యేక పాటలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్పెషల్ సాంగ్ కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటారాయన. తాజాగా ‘పుష్ప’ చిత్రంలోనూ ప్రత్యేక పాట ఉందట. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ, ‘సాహో’ ఫేమ్ శ్రద్ధా కపూర్ నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
“పుష్ప”పై ప్రత్యేక “శ్రద్ధ”
Related tags :