ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని కడప జిల్లాలోని కొన్ని థియేటర్లలో ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)పై ఈసీ చర్యలు తీసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వొద్దంటూ గతంలో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని థియేటర్లలో చిత్రం ప్రదర్శించడంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జేసీ కోటేశ్వరరావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలతో సంబంధం లేని విధుల్లో ఆయన్ను నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 19 వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ను విడుదల చేయొద్దని మరోసారి ఈసీ స్పష్టం చేసింది.
లక్ష్మీస్ NTR దెబ్బకు కడప జాయింట్ కలెక్టర్ బదిలీ
Related tags :