చైనాకు భారత్ మరో షాకిచ్చేందుకు సిద్దమవుతోంది.
భారత్‌లో అడుగుపెట్టాలనుకునే చైనీయులకు ఇకపై వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసే యోచనలో ఉంది.
ఇందులో భాగంగా చైనీయుల నుంచి వచ్చే వీసా దరఖాస్తులపై మరింత లోతైన పరిశీలన జరపనుంది
దేశంలోని యూనివర్సిటీలతో చైనా లింకులను కూడా సమీక్షించాలని భారత్ యోచిస్తోంది.
అదే జరిగితే చైనీస్ విద్యా సంస్థలతో స్థానిక యూనివర్సిటీల టైఅప్స్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.
ఇరు దేశాల విద్యా సంస్థల మధ్య కుదిరిన 54 అవగాహన ఒప్పందాలను ప్రస్తుతం భారత్ సమీక్షిస్తోంది.
ఇందులో ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ,బనారస్ హిందూ యూనివర్సిటీ,జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీతో పాటు చైనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఆఫీస్ హన్‌బన్‌తో సంబంధాలున్న పలు విద్యా సంస్థలు ఉన్నాయి.
మరోవైపు, చైనా పోటీదారుగా ఉన్న 44 సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్ల టెండర్ ప్రక్రియను కూడా భారత్ రద్దు చేసింది.
త్వరలోనే కొత్త టెండర్లు పిలుస్తామని స్పష్టం చేసింది. భారత గడ్డపై చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీసే చర్యల్లో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.