Movies

రాజమౌళికి 10ఏళ్లు కావాలంట

రాజమౌళికి 10ఏళ్లు కావాలంట

దర్శకధీరుడు రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం కథను త్వరలో తెరకెక్కించబోతున్నారని చాలా రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్ ‘సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్  కలిసి నటిస్తున్న ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమరం భీమ్ గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి మహాభారతం కథను తెరకెక్కిస్తారన్న వార్తలపై జక్కన స్పందించారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ… మహాభారతం  తెరకెక్కించాలి అంటే బాహుబలి సినిమా కంటే పది రేట్లు ఎక్కువగా కష్టపడాలని.. నేను ఒకవేళ ఈ సినిమాను మొదలుపెడితే అది పూర్తి చేయడానికి నాకు 10 ఏళ్ళ సమయం పడుతుంది అని తెలియజేశారు. అయితే కరోనా బారిన పడిన రాజమౌళి కుటుంబ సభ్యులు మొత్తం ఈ మధ్యే ఆ వైరస్ బారినుండి బయటపడ్డారు. ఇక జక్కన ప్రస్తుతం తెరకెక్కిస్తున్నా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.