Business

ప్రయాణీకులకు ఆర్టీసీ శుభవార్త

ప్రయాణీకులకు ఆర్టీసీ శుభవార్త

అడ్వాన్స్ రిజర్వేషన్ విషయంలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ. గతంలో ఉన్న గడువుని మరింత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో బస్సు టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ కాలాన్ని పెంచుతున్నట్టు తెలిపింది. గతంలో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే గడువు ఉండేది. ఆ గడువుని పొడిగిస్తూ ప్రస్తుతం బస్సు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ ను 30 రోజుల ముందుగానే చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. కాగా ఈ అవకాశం శనివారం నుండే అమలులోకి వచ్చింది. అయితే ఏపీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.