Movies

అవన్నీ తప్పుడు వార్తలు…నాన్న పరిస్థితి ఇంకా విషమంగానే!

అవన్నీ తప్పుడు వార్తలు…నాన్న పరిస్థితి ఇంకా విషమంగానే!

కరోనా బారిన పడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా రిపోర్ట్ పై గందరగోళం నెలకొంది . కొందరు ఆయనకు నెగిటివ్ అని నిర్దారణ అయిందని అంటుంటే . మరి కొందరు అలాంటిదేమి లేదని అంటున్నారు . తాజాగా ఈ గందరగోళం పై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ క్లారిటీ ఇచ్చారు . బాలుకు నెగిటివ్ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. బాలు కు కరోనా నెగిటివ్ రాలేదని . ఆయన ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారని ఎస్పీ చరణ్ అన్నారు. “మా నాన్న ఆరోగ్యం పై నాకే సమాచారం వస్తుంది. నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆయన ఆరోగ్యం పై వస్తున్న వదంతులు నమ్మకండి అని చరణ్ పేర్కొన్నారు. ఎక్మో సపోర్ట్ తో నాన్నకు వెంటిలేటర్ పై వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్ధిద్దాం “. అని ఎస్పీ చరణ్ అన్నారు. చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవారని ప్రముఖులంతా ప్రార్థిస్తున్నారు