Business

స్టీవ్ కలలు నెరవేర్చిన టిమ్

స్టీవ్ కలలు నెరవేర్చిన టిమ్

మొబైల్‌ ఫోన్లను సాంకేతింగా, ఆకర్శనియంగా తీర్చిదిద్దడంలో యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ ఓ ట్రెండ్‌ సెట్‌ చేశారు. కాగా స్టీవ్‌ జాబ్స్‌ 2011సంవత్సరంలో క్యాన్సర్‌తో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీవ్‌ జాబ్స్‌, టిమ్‌ కుక్‌లు ఇద్దరు సాంకేతికంగా యాపిల్‌ను నెంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టారు. స్టీవ్‌ మరణించాక కుక్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టే సమయానికి 400 బిలియన్‌ డాలర్లు మాత్రమే యాపిల్‌ వద్ద మూలధనంగా ఉండేది. కానీ ఇప్పుడు కుక్‌ సారథ్యంలో యాపిల్‌ సంస్థ ఆదాయం ఐదు రెట్లు పెరిగింది. ప్రస్తుతం యాపిల్‌ సంస్థ మార్కెట్లో ఐఫోన్లతో తన హవా కొనసాగిస్తు యూఎస్‌లో 2 ట్రిలియన్‌ డాలర్ల ఆదాయం సాధించిన మొదటి కంపెనీగా రికార్డు సృష్టించింది. యాపిల్‌ సంస్థ బ్రాండ్‌ కోల్పోకుండా కుక్‌ తీవ్రంగా శ్రమించారు.

ఆయన ఎదుర్కొన్న ముఖ్య సవాళ్లు: ఎఫ్‌బీఐ విపరీత ఆంక్షలు, చైనాతో యూఎస్‌ ట్రేడ్‌ వార్‌, కరోనా వైరస్‌, ఆర్థిక మాంధ్యం ఇన్ని సమస్యలను అధిగమంచి యాపిల్‌ను ఉన్నత స్థానంలో కుక్‌ నిలిపాడు. పౌర హక్కులు, పునరుత్పాదక శక్తి లభ్యతపై తన అభిప్రాయాన్ని ప్రపంచానికి చెప్పి మేధావుల మన్ననలను అందుకున్నారు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక సాఫ్టవేర్‌, వారంటీ ప్రోగ్రామ్‌లు సంగీతం, వీడియో, ఆటలు తదితర విభాగాలను ప్రారంభించి వినియోగదారులను ఆకట్టుకోవడంలో విజయం సాధించారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్‌ నెట్‌ఫ్లక్స్‌ను కొనుగోళ్లు చేసి కుక్‌ తన సత్తా చాటాడు. కంపెనీలకు రేటింగ్‌ ఇచ్చే ఫార్చ్యూన్ సంస్థ యాపిల్‌ 50 బిలియన్‌ వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు ఇవ్స్ సంస్థ అంచనా ప్రకారం యాపిల్‌ సేవల విభాగంలో 750బిలియన్‌ డాలర్ల మూలధనం ఉన్నట్లు తెలిపింది. స్టీవ్‌ జాబ్స్‌ కలలు కన్న యాపిల్‌ సంస్థను కుక్‌ నెరవేరుస్తున్నారని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.