అమెరికాలోని జార్జియా రాష్ట్రం లిండ్‌బర్గ్‌లో తెలుగు విద్యార్థులు నివాసముంటున్న అపార్టుమెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో 80 ఫ్లాట్లు కాలిపోయాయి. జార్జియా స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు 28 మంది వీటిలో నివసిస్తున్నారు. వీరంతా ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా ఉన్నారు. అయితే వారి దుస్తులు, పుస్తకాలు, పాస్‌పోర్ట్‌లు, ఇతర ముఖ్యమైన ధ్రువపత్రాలతో సహా అన్ని వస్తువులు ప్రమాదంలో కాలిపోయాయి.
అట్లాంటాలో తెలుగు విద్యార్థుల అపార్ట్‌మెంట్లు దగ్ధం
Related tags :