సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు
రాహుల్ వ్యాఖ్యలకు నొచ్చుకున్న అజాద్
అజాద్ కు ఫోన్ చేసిన సోనియాగాంధీ
సీడబ్ల్యూసీ సమావేశంలో కొందరు సీనియర్ నేతలపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన గులాం నబీ అజాద్ తీవ్రంగా నొచ్చుకున్నారు. పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా ఆయన సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఈ నేపథ్యంలో అజాద్ ను శాంతింపజేసే పనుల్లో హైకమాండ్ నిమగ్నమైంది. అజాద్ కు సాక్షాత్తు సోనియాగాంధీనే ఫోన్ చేసినట్టు సమాచారం. రాహుల్ వ్యాఖ్యలకు నొచ్చుకోవద్దని ఈ సందర్భంగా సోనియా కోరినట్టు తెలుస్తోంది. అసమ్మతివాదుల డిమాండ్లను వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు సమాచారం.