DailyDose

గ్యాంగ్‌రేప్ కేసులో విస్తుపరిచే వాస్తవాలు-నేరవార్తలు

గ్యాంగ్‌రేప్ కేసులో విస్తుపరిచే వాస్తవాలు-నేరవార్తలు

* మద్యం తాగించి దుస్తులు తీసేసి మూలన పడేసేవారు, ఆ యాంకర్ కాళ్లావేళ్లా పడ్డా వదిలిపెట్టలేదు11 ఏళ్లుగా తనపై 143 మంది అత్యాచారం చేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన బాధిత యువతి ఓ ప్రైవేటు టెలివిజన్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే.. హైదారాబాదులో గెస్ట్ హౌసులకు డిఫరెంట్ అమ్మాయిలను తీసుకువచ్చేవారు. ఆ తర్వాత వారందరికీ ఆల్కహాల్ తాగించి స్పృహ కోల్పోగానే అత్యాచారం చేసేవారు.మరుసటి రోజు ఆ దృశ్యాలు తాలూకు వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేసేవారు. బట్టల్లేకుండా ఒక అమ్మాయి ఫోటోలను ఎక్కడైనా షేర్ చేస్తే, అవి బయటకు వస్తే ఇక చచ్చిపోవడం తప్పించి వేరే మార్గం ఏముంటుంది? నన్ను అనుభవించేవారు. నా ఎకౌంటులో డబ్బులు వేయించుకుని వాళ్లే తీసుకునేవారు.నన్ను తమ స్నేహితురాలు అని చెప్పి తీసుకెళ్లి వారికి అప్పజెప్పేవారు. 2012 నుంచి నరకం చూశాను. పెళ్లయిన తర్వాత నాపై మా బావ అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్ వస్తే ఇక్కడ ఇంతమంది నాపై అత్యాచారం చేశారు. నా కుటుంబ సభ్యులకు చెపితే, నా బలహీనతలు తెలుసుకుని, నా తమ్ముడిని కొట్టారు. దాంతో భయంవేసి సైలెంట్ అయిపోయా.నన్ను ఎక్కడికి తీసుకెళ్లినా ఆల్కాహాలు తాగించి దుస్తులు తీసేసి నన్ను మూలన పడేసేవారు. ఇంకా ఏవేవో మత్తు పదార్థాలు నా ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించేవారు, దానికి కళ్లు తిరిగి పడిపోయేదాన్ని. ఆ తర్వాత నాపై అత్యాచారం చేసేవారు. 2014లో నన్ను ఓ గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అప్పుడు నేను ఓ వ్యక్తిని చూశాను. అతడు పాపులర్ యాంకర్ అని చెప్పారు. నాపై అతడు అత్యాచారం చేస్తున్నాడు. కళ్లు తెరిచి చూడగానే ఎదురుగా వున్నాడు. ప్లీజ్.. నన్ను వదిలేయండి అని అతడి కాళ్లావేళ్లా పడ్డాను. అతడు ఏమాత్రం కనికరం చూపించలేదు. నాపై భౌతిక దాడి చేసి ఆల్కహాలు తాగించి అత్యాచారం చేశాడు. చాలామంది మేం మంచిగా చూసుకుంటామని చెప్పి నన్ను వాడుకున్నారు. వేరే అమ్మాయిల నగ్న ఫోటోలను నాకు పంపించి అలా కావాలని అడిగేవారు” అంటూ చెప్పింది బాధితురాలు. మిర్యాలగూడకు చెందిన బాధిత యువతి పంజాగుట్ట పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

* ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి, తొమ్మిది మందికి గాయాలయ్యాయి.పలాస మండలం నెమలినారాయణ పురం వద్ద జాతీయరహదారిపైజార్ఖండ్ నుంచి విశాఖపట్నం బొలెరో వాహనంలో వెళ్తుండగా ఘటనక్షతగాత్రులను రెండు (1033)అంబులెన్స్లలో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, చికిత్స పొందుతూ ఇద్దరు యువకులు మృతి.తీవ్రగాయాలుపాలైన ఓ యువకుడునీ మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి.మరో తొమ్మిది మంది పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* తిరుపతి గ్రామీణ మండలంలోని ఎల్ఎస్ నగర్ క్రాస్ వద్ద ఎస్ ఇ బి అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న ఎన్డిపిఎల్ (కర్ణాటక మద్యం – పన్నుచెల్లించనిది ) స్వాధీనపరచుకోవడమైనది . (3) నిందితులను అరెస్టుచేసి , వారి నుండి (70) సీసాలు (1000 మి.లీ) 70 లీటర్ల ఓల్డ్ అడ్మిరల్ వి.ఎస్.ఓ.పి బ్రాందీ మరియు AP 03 BY 4047 నెంబరు సుజుకి స్విఫ్ట్ కార్ ను స్వాధీనపరచుకొని తిరుపతి గ్రామీణ స్టేషన్ సెబ్ ఇన్స్పెక్టర్ సి.నాగరాజరెడ్డి కేసును నమోదుచేసి , తిరుపతి ఎస్ ఇ బి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

* హిందూపురంలోనీ బోయ పేటలో ఎక్సైజ్ మహిళా ఎస్సై సరోజాదేవిపై దాడి. స్థానిక బోయ పేటలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారు అన్న సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ ఎస్సై తన సిబ్బందితో తనిఖీకి వెళ్లగా పోలీసులపై తిరగబడ్డ రౌడీషీటర్.

* విజయవాడ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో రౌడీ షీటర్ కొక్కిలిగడ్డ జాన్ బాబు అలియాస్ జాన్, అతనితో పాటు కోనా నాగేశ్వరరావు సస్ఫెక్ట్ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మారణాయుధాలు , గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

* పులివెందులలో దారుణం జరిగింది…అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఓ వ్యక్తి బరితెగించాడు..ఏకంగా ఎస్సైనే వాహనంతో ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లాడు.ఈ ఘటనలో ఎస్సై తృటిలో తప్పించుకుని…నిందితుడిని అరెస్టు చేశారు..కారులో మద్యం అక్రమంగా రవాణా అవుతోందన్న సమాచారంతో ఎస్సై గోపినాథ్ రెడ్డి శుక్రవారం పులివెందులలో వాహన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా అటువైపుగా వెళ్తున్న ఓ కారును ఆపేందుకు ఎస్సై ప్రయత్నించారు.అయితే కారును నడుపుతున్న వ్యక్తి…వాహనాన్ని నిలపకుండా ఎస్సైని ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లాడు..ఎస్సై చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి బయటపడ్డారు.కారు అద్దాలను పగలగొట్టి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.