ఐసీసీ వరుసగా సంచనాలు సృష్టిస్తోంది. భారత్‌కు చెందిన మాజీ మహిళా క్రికెటర్‌కు ఐసీసీ అంతర్జాతీయ రిఫరీల ప్యానెల్లో చోటు కల్పించింది. ఐసీసీ రిఫరీగా ఎంపికైన ఆ మహిళ పేరు జీఎస్ లక్ష్మీ. వయసు 51. మూడు వన్డే, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆమె పర్యవేక్షించింది. దేశవాళీ క్రికెట్లో 2008-09 సీజన్లో తొలి మ్యాచ్‌కు రిఫరీగా చేసింది. జీఎస్ లక్ష్మీ ఐసీసీ మ్యాచ్ రిఫరీగా ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాకు చెందిన క్లైర్ పొల్సాక్ ఏప్రిల్ 27న పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేసిన తొలి మహిళ అంపైర్‌గా ఘనత సొంతం చేసుకుంది. వెంటనే జీఎస్ లక్ష్మీని రిఫరీని ఎంపిక చేయడం గమనార్హం. ‘ఐసీసీలోని అంతర్జాతీయ ప్యానెల్‌కు నన్ను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉంది. కొత్త అవకాశాలను తలుపులు తీశారనిపించింది. భారత్‌లో ఓ క్రికెటర్‌గా, రెఫరీగా నాకు సుదీర్ఘ కెరీర్ ఉంది. ఈ రెండింటి అనుభవంతో అంతర్జాతీయ వేదికపై రాణిస్తానని నమ్మకముంది. ఈ సందర్భంగా ఐసీసీ, బీసీసీఐ, క్రికెట్లో నా సీనియర్లు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అత్యుత్తమంగా పనిచేసి ఐసీసీ నమ్మకాన్ని నిలబెడతా’ అని జీఎస్ లక్ష్మీ తెలిపారు.
ఐసీసీ తొలి మహిళా రిఫరీ ఈమె
Related tags :