Politics

పచ్చదనం కొలిచేందుకు తెలంగాణా కసరత్తు

పచ్చదనం కొలిచేందుకు తెలంగాణా కసరత్తు

పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పురపాలికల్లో మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ధి కార్యక్రమాల ప్రోత్సాహమే లక్ష్యంగా ‘గ్రీన్‌ స్పేస్‌ ఇండెక్స్‌’ పేరుతో దీన్ని రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దీనికి సంబంధించి పట్టణాల్లో పాటించాల్సిన అంశాల వివరాలను ఆయా పురపాలికలకు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ పట్టణాల్లో గ్రీన్‌ కవర్‌, ఓపెన్‌ స్పేస్‌లపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని..ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.