NRI-NRT

సెప్టెంబరు 30వరకు అంతర్జాతీయ విమానాలు బంద్

సెప్టెంబరు 30వరకు అంతర్జాతీయ విమానాలు బంద్

అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగించారు.కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లయిట్లపై నిషేధాన్ని సెప్టెంబర్ 30 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది . కార్గో విమానాలకు ఇది వర్తించదు అని కేంద్ర విమానయాన శాఖ తన ప్రకటనలో పేర్కొంది . DGCA అనుమతి ఉన్న విమానాలకు కూడా ఈ నిబంధన వర్తించదు . ఎంపిక చేసిన రూట్లలో మాత్రం అధికారిక అనుమతి పొందిన అంతర్జాతీయ విమానాలకు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు . అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే . సెప్టెంబర్ 01 తేదీ నుంచి 30 వరకు ఆరవ దశ వందే భారత్ మిషన్ చేపట్టనున్నారు . దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా రిలీజ్ చేసింది . కోవిడ్ -19 నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే .