డేటా గోప్యత కోసం జర్మనీలోని మునిచ్‌లో గూగుల్ ప్రైవసీ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ఈ మేరకు లండన్‌లో నిర్వహించిన ఓ ఆయన మాట్లాడారు. జర్మనీలో దక్షిణ భాగంలో ఉన్న మునిచ్ నగరం దీనికి అనువుగా ఉండడంతో అక్కడే ఏర్పాటు చేశామన్నారు. 2019 చివరి నాటికి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను రెట్టింపు చేస్తామని, 200 మందికి పైగా డేటా ప్రైవసీ ఇంజినీర్లు అక్కడి నుంచే సేవలందిస్తారని తెలిపారు. మునిచ్ ఇంజినీర్లు గూగుల్ అకౌంట్ కంట్రోల్ ప్యానెల్‌ను అభివృద్ధి చేయడంతో పాటు వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌కు అవసరమైన ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లపై దృష్టి పెడుతున్నారని తెలిపారు. దీనివల్ల వినియోగదారులు తమ డేటాను సురక్షితంగా ఉంచుకోవడానికి అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమ దిగ్గజాలైన గూగుల్, ఫేస్బుక్ సంస్థలు వినియోగదారుల డేటా ప్రైవసీపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఈ అంశంపై ఆయా సంస్థలు గత కొంత కాలంగా సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలు చేస్తున్నాయి. డేటాపై ప్రపంచవ్యాప్తంగా హ్యాకర్లు కన్నేసిన నేపథ్యంలో సంస్థలు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు వినియోగదారుల డేటాకు ఏ మేరకు రక్షణ కల్పిస్తాయో వేచిచూడాల్సిందే.
జర్మనీలో 200 మందితో గూగుల్ సేవలు
Related tags :