ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ ఓ కొత్త ప్రతిపాదనను బీసీసీఐ, ఐసీసీ ముందుంచాడు. టీ20ల్లో ఒక బౌలర్‌కి గరిష్ఠంగా ఐదు ఓవర్లు ఇవ్వాలంటూ కోరాడు. టీ20ల్లో ఈ సడలింపులు తీసుకువచ్చేముందే కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లోనే ఈ దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలంటూ కోరాడు. తన ప్రతిపాదనను బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీకి, ఐసీసీకి ట్యాగ్ చేస్తూ ట్విటర్లో పోస్టు చేశాడు. ‘టీ20ల్లో ఒక బౌలర్‌కి 5 ఓవర్ల నా అభిప్రాయాన్ని అనేక మంది సమర్థిస్తున్నారు. ఆ సడలింపులను సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఐపీఎల్‌లోనే ప్రయోగిస్తే బాగుంటుంది’ అంటూ ఈ మాజీ స్పిన్నర్ పోస్టు చేశాడు. షేన్ వార్న్ పోస్టును సమర్థిస్తూ అనేక మంది కాంమెంట్లు చేశారు. క్రికెట్ నాణ్యతను పెంచేందుకు ఈ పనిని ఎప్పుడో చేసి ఉండాల్సిందిగా పేర్కొన్నారు. అయితే అలా చేస్తే ఆల్‌రౌండర్లకి అన్యాయం జరుగుతుందని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం టీ20ల్లో ఒక బౌలర్ గరిష్ఠంగా నాలుగు ఓవర్లు మాత్రమే వేయాలనే నిబంధన ఉంది. ఎక్కువ మందికి బౌలింగ్ అవకాశం కల్పించడం, మరికొన్ని కారణాలతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
అయిదు ఇవ్వండి
Related tags :