Movies

జెంటిల్‌మేన్-2

జెంటిల్‌మేన్-2

యాక్షన్‌ హీరో అర్జున్‌ కథానాయకుడిగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘జెంటిల్‌మేన్‌’. 1993లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నిర్మాత కేటీ కుంజుమన్‌ (Kunjumon) ‘జెంటిల్‌మేన్‌’ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు ప్రకటించారు. ‘ఒకప్పుడు మేము నిర్మించిన మెగా బ్లాక్‌బస్టర్‌ ‘జెంటిల్‌మేన్‌’ సినిమాకి సీక్వెల్‌గా త్వరలో ‘జెంటిల్‌మేన్‌-2’ నిర్మించనున్నాం. ఈవిషయాన్ని మీ అందరితో పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌లో బాలీవుడ్‌, దక్షిణాది పరిశ్రమకు చెందిన అగ్రనటీనటులు నటించనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సీక్వెల్‌ని కూడా శంకర్‌ రూపొందించనున్నారో, లేదో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.