* అక్రమంగా బంగారం తవ్వుతున్న 50 మంది బలి!కాంగో దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బంగారు గని కూలిన ఘటనలో 50 మంది మృతిచెందారు.ఈ ఘటన తూర్పున ఉన్న కమితుగ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.అక్కడ బంగారం కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది.కాంగోలో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు అనుమతి ఉన్న కెనడా మైనింగ్ కంపెనీ బన్రో కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ప్రమాదం చోటుచేసుకున్న గని లేదని అధికారులు తెలిపారు.కాంగోలో అక్రమ తవ్వకాలు సర్వసాధారణం. తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.
* సీఎం జగన్ చిన్నాన్న… వివేకా హత్య కేసులో రెండో విడత విచారణ చేపట్టింది సీబీఐ. అంతకు ముందు జులైలో 2 వారాలపాటు పులివెందుల, కడపలో విచారణ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి విచారణ చేస్తోంది. ఇప్పటికే ఆయన ఇంట్లో కేసుకు సంబంధించి.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన అధికారులు కీలక వ్యక్తులను విచారించారు. జులై 31న కడప నుంచి దిల్లీ వెళ్లిపోయారు. 40 రోజుల తర్వాత రాష్ట్రానికి చేరుకున్న అధికారులు… ఇవాళ మళ్లీ పులివెందుల అతిథిగృహంలో కేసు వివరాలపై ఆరా తీశారు.
* బాపట్ల మండలం పాండురంగాపురం గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఎటువంటి అనుమతులు లేకుండా పది అడుగుల మేర ఇసుక తవ్వకాలు.మైనింగ్ అధికారులు చూసి పారిపోయిన ఇసుక మాఫియా నేతలు.ట్రాక్టర్లు,జేసీబీలను స్వాధీనం చేసుకున్న మైనింగ్ అధికారులు.
* అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు పట్టివేతకృష్ణాజిల్లా నుండి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లును పోలీసులు పట్టుకున్నారు.కైకలూరు కలిదిండి మండలం పోలీసులు రాత్రి వాహనాల తనిఖీలు చేస్తూ ఉండగా సానా రుద్రవరం గ్రామం వద్ద పోలీసులు తనిఖీ చేయగా సుమారు టన్ను తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
* రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత ఉండే విధంగా నిర్వాహకులు పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, నిరంతరం పరివ్యేక్షించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి:డిజిపి
* పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్య యత్నం.ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేదింపులే కారణమని ఆరోపణలు.సూపరింటెండెంట్ బాలకృష్ణన్ సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.బాలకృష్ణన్ పై గత కొంతకాలం గా వేదింపులు ఆరోపణలు.బాలకృష్ణన్ పై విచారణ కమిటి ఏర్పాటు.విచారణ కమిటీ ఎదుట బాధితుల గగ్గోలు.
* మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? ఖాకీస్వామ్యంలో ఉన్నామా..? అని హైకోర్టు వ్యాఖ్యానించింది అంటే… రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
* పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో బీఎస్‌ఎఫ్ జవాన్లు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అబోహార్ సరిహద్దు అవుట్‌పోస్ట్ వద్ద శనివారం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో రైఫిళ్లతోపాటు మ్యాగజైన్లు, బుల్లెట్‌లను గుర్తించి సీజ్ చేశారు.