Movies

చిరంజీవికి చెల్లెల్లిగా సాయిపల్లవి

చిరంజీవికి చెల్లెల్లిగా సాయిపల్లవి

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కనున్న ఓ సినిమాలో యువ కథానాయిక సాయిపల్లవి అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ‘సైరా’ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సినిమాల విషయంలో చిరు జోరు పెంచారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఆయన త్వరలో బాబీ, సుజీత్‌, మెహర్‌ రమేష్‌లతో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మలయాళీ సినిమా ‘లూసిఫర్‌’ రీమేక్‌ పనులు జరుగుతున్నాయి. మరోవైపు తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘వేదాళం’ రీమేక్‌లో చిరు నటించనున్నట్లు గత కొన్నిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మెహర్‌ రమేష్‌ ఈ రీమేక్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, తాజా సమాచారం.. ‘వేదాళం’ సినిమాలో అజిత్‌తోపాటు అతని సోదరిగా నటించిన లక్ష్మీ మేనన్‌ పాత్ర కూడా ఎంతో కీలకమైనది. దీంతో సదరు పాత్రకి సాయిపల్లవి అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తుందట. అయితే సాయిపల్లవి సైతం సోదరి పాత్ర చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.