* AP కొవిడ్ కేసులు.రాష్ట్రంలో కొత్తగా 7,956 కరోనా కేసులు, 60 మరణాలు.రాష్ట్రంలో 5,75,079కి చేరిన కరోనా బాధితుల సంఖ్య.రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 4,972 మంది మృతి.రాష్ట్రంలో ప్రస్తుతం 93,204 కరోనా యాక్టివ్ కేసులు.
* కరోనాతో ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతున్నది. కరోనా కారణంగా ఇప్పటికే ప్రపంచంలో కోట్లాది మంది ఇబ్బందులు పడుతున్నారు. వైరస్ అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ మనిషిని ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. వైరస్ చుట్టూ ప్రోటీన్ పొర, దాని లోపల జన్యువులు ఉంటాయి. కరోనా కణంలోపల ఉండే జన్యువులపై పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు. అయితే, ఈ వైరస్ లో శరీరంలోకి ప్రవేశించిన తరువాత శరీరంలో పెద్దగా యాక్టివ్ గా లేని కణాలపై దాడిచేసి అందులోకి ప్రవేశించి అక్కడ వైరస్ తన ఉత్పత్తిని పెంచుకుంటున్నట్టు పరిశోధనల్లో తేలింది. యాక్టివ్ గా లేని కణాల నుంచి క్రమంగా శ్వాసవ్యవస్థలోకి ప్రవేశించి అక్కడ వైరస్ ఎక్కువగా దాడై చేస్తున్నట్టు తేలింది.
* పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న పలువురు ఎంపీలకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా 17 మంది ఎంపీలకు కరోనా సోకినట్లు తేలింది. అత్యధికంగా బీజేపీకి చెందిన 12 మంది ఎంపీలు కరోనా బారిన పడినట్లు పరీక్షల్లో బయటపడింది. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, శివసేన, డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం), ఆర్ఎల్పీ(రాష్ట్రీయ లోక్‌తంత్రిక్ పార్టీ) ఎంపీలు ఒక్కొక్కరు చొప్పున మహమ్మారి బారిన పడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
* గడిచిన 24 గంటల్లో ఇండియాలో 92,071 కరోనా కేసులు. 1136 మరణాలు. భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 48,46,428. కరోనా మృతుల సంఖ్య 79,722.
* దేశంలో కరోనా కలకలం కొనసాగుతుంది. సామాన్య ప్రజల నుండి ప్రజా ప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా 24 మంది ఎంపీలు ఎనిమిది మంది కేంద్ర మంత్రులు కరోనా వైరస్ బారినపడ్డట్లు అధికారుల వెల్లడించారు. నేడు ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల సమయంలో ఇంతమందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో కలవరాన్ని కలిగిస్తోంది. అయితే వర్షకాల పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యే ముందు ఉభయ సభల సభ్యులందరూ కరోనా మహమ్మారి పరీక్ష చేయించుకుని తప్పనిసరిగా కరోనా నెగెటివ్ రిపోర్టును సమర్పించాలి. ఇందుకు పార్లమెంటరీ సెషన్ ప్రారంభానికి 72 గంటలలోపు ప్రభుత్వం అనుమతి పొందిన ఏదైనా ఆసుపత్రి గానీ ప్రయోగశాలలో గానీ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో పరీక్షలు తప్పనిసరి చేశారు.
* తిరువూరులో కొత్తగా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్..స్థానిక పీపీ యూనిట్ లో 25 మందికి ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు.