* ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి శుక్రవారం తొలగించింది. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్స్‌ను కూడా తీసివేసింది. పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్స్ మాత్రం యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో గూగుల్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇది వరకే పేటీఎంకు గూగుల్ నోటీసులు జారీ చేసిందని, తరచూ నిబంధనలు ఉల్లంఘించడంతో తాజాగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్ నిబంధనల ప్రకారం.. ఎలాంటి జూదాలు, ఆన్లైన్ బెట్టింగులు నిర్వహించకూడదు. కానీ, పేటీఎం, పేటీఎం ఫస్ట్‌గేమ్ యాప్స్ ద్వారా ఫాంటసీ క్రికెట్ సేవలను ప్రారంభించింది. జూదాన్ని ప్రోత్సహించేదిగా ఈ చర్య ఉండడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడంపై పేటీఎం స్పందించింది. గూగుల్ ప్లేలో ప్రస్తుతానికి పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ కొత్తగా డౌన్లోడ్ చేసుకోవడానికి, అప్డేట్ చేసుకోవడానికి అందుబాటులో లేదని పేర్కొంది. త్వరలో మళ్లీ సేవలు ప్రారంభమవుతాయని తెలిపింది. ప్రస్తుతానికి పేటీఎం యాప్‌ను యథావిధిగా వినియోగించుకోవచ్చని, అందులో సొమ్ముకు ఎలాంటి ఢోకా లేదని ట్వీట్ చేసింది. ప్రస్తుతం పేటీఎంకు 5 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. పేటీఎం ఐవోఎస్ వెర్షన్ మాత్రం యథావిధిగా కొనసాగుతోంది.
* ఏపీలో పెట్రో, డిజీల్ పై సెస్సు..పెట్రోల్, డిజీల్ పై లీటరుకు రూ. 1 మేర సెస్సు విధిస్తూ ఉత్తర్వులు..ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం..
* నేటి నుంచి SBI కొత్త రూల్స్.. ఖాతాదారులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే !ఎస్బీఐ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. బ్యాంక్ సెప్టెంబర్ 18 నుంచి కొత్త రూల్స్ అమలులోకి తీసుకువస్తోంది. దీంతో బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్‌లో మార్పులు చేసింది. ఏటీఎం మోసాలను నియంత్రించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఎస్బీఐ ఇటీవల ఓటీపీ ఆధారిత ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.10,000 లేదా ఆపైన మొత్తాన్ని ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవాలంటే కచ్చితంగా ఓటీపీ ఎంటర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి డబ్బులు తీసుకోవాలి.ఈ సదుపాయం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఎస్బీఐ ఓటీపీ ఆధారిత ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్‌ను రోజంత అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. అంటే మీరు ఎప్పుడైనాసరే ఎస్బీఐ నుంచి రూ.10,000కు పైన డబ్బులు తీసుకోవాలంటే కచ్చితంగా ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే.ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా రూల్స్‌ను 24 గంటలు అందుబాటులోకి తీసుకురావడంతో ఏటీఎం మోసాలు తగ్గుతాయని బ్యాంక్ విశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ డెబిట్ కార్డు కలిగిన వారు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడానికి వెళ్లేటప్పుడు మొబైల్ ఫోన్ కూడా వెంట తీసుకెళ్లండి. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు.కాగా ఈ ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా రూల్స్ ఏటీఎం ఎస్‌బీలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలకు వర్తించదు. కాగా స్టేట్ బ్యాంక్.. అసెట్స్, డిపాజిట్స్, బ్రాంచులు, కస్టమర్లు, ఉద్యోగులు ఇలా ఏ ప్రాతిపదికన చూసిన దేశంలో అతిపెద్ద బ్యాంక్‌గా ఉంది. 2020 మార్చి 31 నాటికి ఎస్బీఐ డిపాజిట్ బేస్ రూ.32 లక్షల కోట్లుగా ఉందని చెప్పుకోవచ్చు.
* అమెరికా టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్ భారత్‌లో ఐఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. తాము త్వరలో ఆపిల్ తొలి ఆన్లైన్ స్టోర్‌ను భారత్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ట్విటర్లో ప్రకటించారు. తద్వారా భారత్‌లో తమ కస్టమర్లకు మరింత చేరువవుతున్నట్టు తెలిపారు.
* నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కొనుగోలుకు ఇతర సంస్థలు ఆసక్తి చూపేలా కేంద్రం మరో ఆలోచన చేస్తోంది. సంస్థకు ఉన్న అప్పుల భారం తగ్గించాలని యోచిస్తోంది. దీంతో పాటు పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన గడువునూ మరికొంతకాలం పాటు పొడిగించాలని భావిస్తోంది.
* ఇప్పటి పిల్లలు.. అంతర్జాలాన్ని అవలీలగా వాడగలరు. ఎలాంటి కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకోగలరు. మరి ఈ ఆసక్తి డబ్బు విషయంలోనూ ఉందా? అనుమానమే కదూ! అన్ని విషయాల్లోనూ కనిపించే ఆసక్తిని చూసి మురిసిపోయే తల్లిదండ్రులు.. పిల్లలకు డబ్బు విషయాలు చెప్పడానికి మాత్రం వెనకడగు వేస్తారు. పిల్లల భవిష్యత్‌కు విద్య ఎంత ముఖ్యమో.. ఆర్థిక విజ్ఞానం కూడా అంతే అవసరం అని తల్లిదండ్రులు గమనించాలి. అప్పుడే వారు అన్నింటా విజయం సాధించగలరు.