దేశంలో కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై కొంత కాలం నిషేధం విధించినట్లు సౌదీ అరేబియా పేర్కొంది. అయితే భారత్, బ్రెజిల్, అర్జెంటీనా దేశాలకు నిషేధం వర్తించనున్నట్లు సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీఐసీఏ) బుధవారం సర్క్యులర్ విడుదల చేసింది. అయితే కరోనా ఉదృతి నేపథ్యంలో ఏయిర్‌లైన్స్, చార్టెడ్ విమానాలలో తాజా నిబంధనలు అమలు చేయనున్నాయి. ఈ నిషేధం ఎంత వరకు ఉంటుందో జీఎస్‌ఏ ప్రకటించలేదు. దేశంలో సౌదీ, యూఏఈకి భారీగా వలసలు వెళ్తుంటారు. సెప్టెంబర్ 4వ తేదీన విమానంలో ప్రయాణించిన ఇద్దరు విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్ సోకింది. అయితే మే 6నుంచి వందేభారత్ మిషన్ ద్వారా కొన్ని అంతర్జాతయ విమానాలకు ఇరు దేశాలు(భారత్, సౌదీ) అనుమతిచ్చాయి. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు జీఏసీఏ పేర్కొంది. మరోవైపు గల్ఫ్ దేశాల కూడా భారత్‌కు విమానాలను నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. అయితే మెరుగైన వాణిజ్యం కోసం ఇరు దేశాల ప్రజలు విమాన రాకపోకలు నిషేధం త్వరగా ఎత్తివేయాలని ఆశిస్తున్నారు.
ఇండియా విమానాలపై సౌదీ నిషేధం
Related tags :