విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే పాఠశాలలను మూసివేస్తామని ప్రభుత్వాలు హెచ్చరించడం, మూసేయడం తెలుగు రాష్ట్రాల్లో చాలాసార్లు జరిగింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నిరసనలు, ఆందోళనలు చేస్తుంటారు. అయితే, ఇలా పాఠశాలలు మూసివేయడం భారత్‌లోనే కాదు, ఫ్రాన్స్‌లోనూ ఉంది. ఇక్కడి ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లో ఉన్న ‘క్రెట్స్ ఎన్ బెల్లెడొన్నే’ అనే పట్టణంలోని పాఠశాలలో ఇంతకు ముందు 11వ తరగతిలో 266 మంది విద్యార్థులు ఉండగా, ఇటీవల ఆ సంఖ్య 261కి తగ్గింది. విద్యార్థుల సంఖ్య పడిపోయిందంటూ ఆ పాఠశాలలో 11వ తరగతిని ఎత్తివేస్తామని అధికారులు తాజాగా చెప్పారు. అందుకు నిరసన వ్యక్తం చేస్తూ మైఖేల్ గిరెర్డ్ అనే రైతు తన 15 గొర్రెలను తోలుకెళ్లి ఆ పాఠశాలలో చేర్పించారు. వాటికి బా-బెటె, డాల్లీ, షావున్… లాంటి పేర్లు పెట్టి స్కూలు రికార్డుల్లో నమోదు చేయించారు.
విద్యార్థులు తగ్గారని బళ్లో గొఱ్ఱెలను జేర్చారు
Related tags :