NRI-NRT

నేపాల్‌కు ₹154కోట్లు ఇచ్చిన ఇండియా

నేపాల్‌కు ₹154కోట్లు ఇచ్చిన ఇండియా

నేపాల్‌కు భారత్‌ 1.54 బిలియన్‌ (రూ.154 కోట్లు) నిధులిచ్చింది. ఆ దేశంలో గత ఏడాది సంభవించిన భూకంపాలు, ప్రకృతి విపత్తుల్లో దెబ్బతిన్న ఇండ్ల పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం 1.54 బిలియన్‌ నేపాలీస్‌ రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. నేపాల్‌లో భారత రాయబార కార్యాలయానికి చెందిన డిప్యూటీ చీఫ్ నాంగ్యా ఖంపా, ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిషీర్ కుమార్ ధుంగనాకు ఈ చెక్కును గురువారం అందజేశారు. భారత్‌ పట్ల నేపాల్‌ వైఖరి ఇటీవల మారింది. చైనా ఒత్తిడితో భారత్‌తో విభేదాలు పెట్టుకుంటున్నది. భార‌త్‌ భూభాగాలను తనవిగా చెప్పుకొంటూ కొత్త మ్యాప్‌ను తయారు చేయడం ఇరు దేశాల సంబంధాలను దూరం చేసింది. అయినప్పటికీ భారత్‌ నేపాల్‌కు అండగా నిలుస్తున్నది. గత ఏడాది భూకంపాలు, భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరిత్యాల సందర్భంగా నేపాల్‌లో వేలాది ఇండ్లు నేలమట్టమయ్యాయి. నాడు భారత్‌ ఇచ్చిన హామీని నేడు నెరవేర్చింది. ఇండ్ల పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం రూ.154 కోట్ల నిధుల చెక్కును నేపాల్‌కు అందజేసింది.