DailyDose

ఆ వివరాలు బయటకి చెప్పొద్దు-తాజావార్తలు

Breaking News - Sasikala Requests To Hide Her Release Date

* డిక్లరేషన్‌ ఇవ్వకుండా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముఖ్యమంత్రి జగన్‌ వెళ్లడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఆలయ ఆచారాలను గౌరవించాలన్న ప్రభుత్వ నిబంధనను ముఖ్యమంత్రే ఉల్లంఘించారని తప్పుబట్టారు. అలాంటప్పుడు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సీఎం జగన్‌ తిరుమలలో మాస్క్‌ పెట్టుకోలేదని, ఆ స్థాయి వ్యక్తి నిబంధనలు పాటించకుంటే ఎలా అన్నారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆదర్శవంతుడిగా ఉండాలే తప్ప.. వేలెత్తి చూపే వ్యక్తిగా ఉండకూడదని వ్యాఖ్యానించారు.

* జైలు నుంచి తాను ఎప్పుడు విడుదలవుతాననే వివరాలను బయటకు వెల్లడించొద్దని జయలలిత నెచ్చెలి వీకే శశికళ అధికారుల్ని కోరారు. ఈ మేరకు ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులకు లేఖ రాశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన శశికళ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, జైలు నుంచి ఆమె విడుదలకు సంబంధించి ఊహాగానాలు వస్తున్న వేళ అధికారులకు లేఖ రాశారు. సమాచార హక్కు చట్టం కింద కూడా తన జైలు శిక్ష, విడుదల తదితర అంశాలను వెల్లడించొద్దని కోరారు. వ్యక్తిగత గోప్యత హక్కు కూడా ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించారు. తన వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడం కూడా వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమే అవుతుందని శశికళ పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు పబ్లిసిటీ కోసమో, రాజకీయ దుష్ప్రచారం కోసమో ఇలాంటి దరఖాస్తులు చేస్తారని తెలిపారు.

* శ్రీశైలంలో అన్యమత పార్శిల్‌ కలకలం రేగింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్ సంస్థ ద్వారా ఓ పార్శిల్ వచ్చింది. ఆర్టీసీ కార్గో ద్వారా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు పార్శిల్ రావడంతో స్థానికులు గుర్తించి దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. దీంతో దేవస్థానం ఇన్‌ఛార్జి చీఫ్‌ సెక్యూరిటీ అధికారి శ్రీహరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

* రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఖండించింది. భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వెంటనే కొడాలి నానిని తన మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలంటూ రేపు అన్ని జిల్లాల కలెక్టరు కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. భాజపాపై మంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పీవీఎన్‌ మాధవ్‌, విష్ణువర్ధన్‌ రెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోన్న మంత్రి నానిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సైతం నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని తమ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తోందన్నారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అండ చూసుకునే మంత్రి నాని తన నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు. అధికార పార్టీలో పిచ్చోళ్లు ఎక్కవయ్యారని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహకారంతో ఇలాంటి వాళ్లను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాలని కోరతామని వారు ఎద్దేవా చేశారు.

* ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. మూర్ఖత్వానికి ప్రతి రూపంగా జగన్‌ మిగిలిపోయారని ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల్లో కరోనా కేసులు, వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. సీఎం జగన్‌ మాస్కు పెట్టుకోకపోగా వేరే వాళ్లు పెట్టుకుంటే ఊరుకోరని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దళిత యువకుడు కిరణ్‌ మాస్క్‌ పెట్టుకోలేదన్న కారణంతో పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి చంపడమెందుకని ప్రశ్నించారు. కిరణ్‌ మృతి ఘటన.. మాస్క్‌ పెట్టుకోనందుకా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అని లోకేశ్‌ నిలదీశారు.తిరుమల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రితో ఫొటో దిగేందుకు మాస్కు పెట్టుకుని వచ్చిన వారిని మాస్కు తీసేయాలంటూ జగన్‌ ఆదేశించిన ఓ వీడియోను లోకేశ్‌ తన ట్విటర్‌లో పోస్టు చేశారు.

* ప్రధాని నరేంద్రమోదీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దేశ ప్రధానిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కొడాలి నాని వాస్తవాన్ని గ్రహించి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. అమరావతిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు చెప్తే తప్ప ప్రధానిపై నాని ఏం వ్యాఖ్యలు చేశారో తెలియదన్నారు. తెదేపా నేతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మోదీ గురించి పార్టీలో ఎవరైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని.. నేతలు సంయమనం పాటించాలని సజ్జల సూచించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న సమస్యలు, రాజధాని అమరావతి అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావించినట్లు తెదేపా లోక్‌సభాపక్ష నేత గల్లా జయదేవ్‌ తెలిపారు. రాష్ట్రానికి మూడు రాజధానులు చట్ట ప్రకారం సాధ్యం కాదన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తినట్లు చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన సందర్భంగా తెదేపా ఎంపీలు దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్‌ మాట్లాడారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లాను కలిసి అమరావతి విషయాన్ని ప్రస్తావించగా.. ఆయన తమ అభిప్రాయాలతో ఏకీభవించినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు బాగా నిర్వహించారన్నారు. సభ్యులకు కరోనా సోకుతున్న నేపథ్యంలో పది రోజులకే సమావేశాలకు ముగింపు పలకాల్సివచ్చింది. జీఎస్టీ, పోలవరం నిధులు సహా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై సభలో ప్రస్తావించినట్లు గల్లా జయదేవ్‌ వివరించారు. ఇంగ్లీష్‌ మీడియం విద్యపై నిర్మాణాత్మక సూచనలు చేశామన్నారు. ఏపీలో దేవాలయాలు, దళితులపై దాడుల గురించి సభలో మాట్లాడామన్నారు. 23 బిల్లులపై తాము చర్చలో పాల్గొని అభిప్రాయాలను చెప్పామన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలక సలహాలు ఇచ్చామని.. ఉద్యోగాలు దెబ్బతినకుండా ఉండేందుకు పలు సూచనలు చేసినట్లు జయదేవ్‌ తెలిపారు.

* తిరుమల శ్రీవారి ఆలయ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా బాధాకరమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల పట్ల రాజకీయ జోక్యంతో వివాదాలు చేయడం తగదని హితవు పలికారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు అనాదిగా వస్తున్నాయన్నారు. వాటిలోని లోటుపాట్లను విచారించేది.. శాస్త్ర పద్ధతుల్లో చర్చించేది స్వామీజీలు, పీఠాధిపతులని అన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ నేతలు తలదూర్చడం భావ్యం కాదని సంజయ్‌ అభిప్రాయపడ్డారు.

* ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌(59) కన్నుమూశారు. యూఏఈలో జరుగుతున్న మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌లో స్టార్‌స్పోర్ట్స్‌ తరఫున వ్యాఖ్యాతగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం ముంబయిలోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. మెల్‌బోర్న్‌లో పుట్టి పెరిగిన డీన్‌జోన్స్‌ ఆస్ట్రేలియా తరఫున 52 టెస్టులు ఆడగా 46.55 సగటుతో 3,631 పరుగులు చేశారు.

* దేశీయ మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆర్థికవేత్తల ఆందోళన ప్రభావం ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లపైనా పడింది. దీంతో వరుసగా ఆరో రోజూ దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 1100 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ 11వేల మార్కు దిగువకు చేరింది. ఆగస్టు 4 తర్వాత నిఫ్టీ 11వేల దిగువకు చేరడం గమనార్హం.

* భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) వాయిదా పడింది. నవంబర్‌ 20 నుంచి 28 మధ్య గోవాలో జరగాల్సిన 51వ చిత్రోత్సవాలను వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 24 తేదీల మధ్య నిర్వహించాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్‌ వెల్లడించారు. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌తో చర్చించిన అనంతరం ఈ ప్రకటన జారీ చేసినట్టు పేర్కొన్నారు. కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమాచార, ప్రసారాల శాఖ అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

* తిరుమల శ్రీవారి ఆలయ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా బాధాకరమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల పట్ల రాజకీయ జోక్యంతో వివాదాలు చేయడం తగదని హితవు పలికారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు అనాదిగా వస్తున్నాయన్నారు.

* రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్టు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రిని కలిసిన అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, కేంద్ర సహకారం కోరామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న రాష్ట్రానికి నిధులు విడుదల వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.

* వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో భాగంగా బ్రిటన్ మరో ముందడుగు వేయనుంది. ఇప్పటివరకు ఆరోగ్యవంతులపై ప్రయోగాలు జరుపుతుండగా.. తాజాగా ‘హ్యూమన్‌ ఛాలెంజ్’‌ ప్రయోగాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తద్వారా వ్యాక్సిన్‌ సమర్థతను కచ్చితంగా పరీక్షించే వీలుంటుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే తుదిదశకు చేరుకున్న వ్యాక్సిన్‌ ప్రయోగాలకు, తాజా విధానం మరో ముందడుగు కానుంది.

* దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి ఆగడం లేదు. రోజూ 80వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న కూడా దేశ వ్యాప్తంగా 87,374 కొత్త పాజిటివ్‌ కేసులు వచ్చాయి. గడిచిన 24గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో 75శాతానికి పైగా కేవలం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదు కావడం గమనార్హం. తాజాగా అత్యధికంగా మహారాష్ట్రలో నమోదు కాగా.. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, యూపీ, తమిళనాడు, దిల్లీ, ఒడిశా, దిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌లలో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

* తమిళ రాజకీయ నాయకుడు, నటుడు విజయ కాంత్‌కు కరోనా వైరస్‌ పాజటివ్‌ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ‘‘విజయ కాంత్‌కు సెప్టెంబర్‌ 22న కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయనకు చెన్నైలోని ఎం.ఐ.ఓ.టీ. హాస్పిటల్స్‌లో చికిత్స అందిస్తున్నాము. ప్రస్తుతం ఆయన ఆరోగ్య స్థితి నిలకడగా ఉంది. ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుని, డిశ్చార్జి‌ అవుతారు.’’ అని ఆస్పత్రి మేనేజింగ్‌ డైరక్టర్‌ పృధ్వీ మోహన్‌దాస్‌ ప్రకటించారు.

* ప్రధాని నరేంద్రమోదీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దేశ ప్రధానిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కొడాలి నాని వాస్తవాన్ని గ్రహించి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. అమరావతిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు చెప్తే తప్ప ప్రధానిపై నాని ఏం వ్యాఖ్యలు చేశారో తెలియదన్నారు.

* శ్రీశైలంలో అన్యమత పార్శిల్‌ కలకలం రేగింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్ సంస్థ ద్వారా ఓ పార్శిల్ వచ్చింది. ఆర్టీసీ కార్గో ద్వారా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు పార్శిల్ రావడంతో స్థానికులు గుర్తించి దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. దీంతో దేవస్థానం ఇన్‌ఛార్జి చీఫ్‌ సెక్యూరిటీ అధికారి శ్రీహరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.