Movies

నయనతార ఖర్చు పెరిగింది

నయనతారా ఖర్చు పెరిగింది

గత ఐదేళ్లుగా నిర్విఘ్నంగా ప్రేమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు దర్శకనాయిక ద్వయం విఘ్నేష్‌శివన్‌, నయనతార. ఓనమ్‌ వేడుకల సందర్భంగా ఈ జంట కలిసి తీయించుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రియుడుతో కలిసి తరచు విహార యాత్రలకు వెళ్తుంటుంది నయనతార. ఈ మధ్యే విఘ్నేష్‌శివన్‌ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ప్రేమికుల జంట గోవాకు వెళ్లారు. దాదాపు మూడురోజుల పాటు అక్కడే బస చేశారు. అయితే మనుపెన్నడూ లేనివిధంగా విఘ్నేష్‌శివన్‌ బర్త్‌డే వేడుకల కోసం నయనతార 30లక్షల రూపాయల్ని ఖర్చుచేసిందని తెలిసింది. కేవలం మూడురోజుల విహారం కోసం ఈ స్థాయిలో విలాసంగా ఖర్చుపెట్టడం చాలా అరుదని చెబుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సుదీర్ఘసమయాన్ని చెన్నైలోనే గడపడంతో గోవా ట్రిప్‌ కోసం నయనతార భారీగా ఖర్చు చేసిందని అంటున్నారు. ప్రస్తుతం విఘ్నేష్‌శివన్‌ దర్శకత్వంలో నయనతార ‘కాదువాక్కుల రెండు కాదల్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. త్వరలో షూటింగ్‌ మొదలుకానుంది. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లిపీటలెక్కాలని నిర్ణయించుకున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు.