ముంబై డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్న సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్‌ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఆరోపించారు. ఆమె కేసులో హైదరాబాద్‌కూ లింకులు ఉన్నాయన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన డ్రగ్స్ కుంభకోణంలో అనేకమంది సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నారని, వారిపై రోజుల తరబడి విచారణ జరిపిన తర్వాత ఎలాంటి చర్యలు లేకుండా తొక్కి పెట్టారన్నారు. తాజాగా ముంబై డ్రగ్స్ మాఫియా కేసులో రకుల్‌ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందని, ఆమెకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలకూ సన్నిహిత సంబంధాలూ ఉన్నాయని ఆరోపించారు. ఈ సమయంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసులో లోతైన విచారణ జరిపితే ప్రభుత్వ పెద్దల బాగోతాలు బయటపడతాయన్నారు. కేంద్ర ప్రభు త్వ పథకమైన ‘భేటీ పడావో, భేటీ బచావో’ పథకానికి తెలంగాణ రాష్ట్ర బ్రాం డ్ అంబాసిడర్‌గా రకుల్‌ప్రీత్ సింగ్ పనిచేస్తున్నారనీ ఆయన పేర్కొన్నారు.
రకుల్‌ను కాపాడుతున్న ఆ తెలంగాణా నేతలు ఎవరు?
Related tags :