Kids

ఏపీలో పాఠశాలలు మళ్లీ బంద్

Andhra Schools Re-Opening Postponed By A Month

ఏపీలో పాఠశాలల ప్రారంభించే తేదీ మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 5న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని భావించిన జగన్ సర్కార్.. మరో నెల రోజుల పాటు ఈ తేదీని వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా నవంబర్ 2న స్కూళ్లు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జగనన్న విద్యా కానుకను మాత్రం అక్టోబర్ 5న ప్రారంభించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఆ రోజు రాష్ట్రంలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేయనున్నారు. ఏపీలో స్కూల్స్‌ను ప్రారంభించాలని జగన్ సర్కార్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను మరింతగా మెరుగు పరిచేందుకు నాడు నేడు అనే కార్యక్రమం మొదలుపెట్టిన జగన్ సర్కార్.. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తోంది. పాఠశాలల పున:ప్రారంభానికి ముందే జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఈసారి పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యాకానుకను అమలు చేయాలని నిర్ణయించింది. అందుకే పాఠశాలల పున:ప్రారంభం తేదీ వాయిదా పడినప్పటికీ.. జగనన్న విద్యాకానుకను మాత్రం అక్టోబర్ 5న ప్రారంభించాలని భావిస్తోంది. విద్యార్థులకు కావాల్సిన యూనిఫామ్‌లు, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్ వంటివి జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా వారికి అందించనుంది ఏపీ ప్రభుత్వం.