DailyDose

మమతను వేధిస్తున్న మోడీ-రాజకీయ-05/16

మమతను వేధిస్తున్న మోడీ-రాజకీయ-05/16-Modi giving hard times and troubles to mamata banerjee

* బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని ప్ర‌ధాని మోదీ, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా టార్గెట్ చేశార‌ని, ప‌క్కా ప్రణాళిక ప్ర‌కారం అది జ‌రుగుతోంద‌ని బీఎస్పీ నేత మాయావ‌తి అన్నారు. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని, మంచి ప‌రిణామం కాదు అని, ఇది దేశ ప్ర‌ధానికి త‌గిన అంశం కాదు అని మాయావ‌తి అన్నారు. ఇవాళ ఆమె ల‌క్నోలో మీడియాతో మాట్లాడారు. బెంగాల్‌లో ఎన్నిక‌ల సంఘం ప్ర‌చారాన్ని రేప‌టి నుంచి నిషేధించింద‌ని, కానీ ఇవాళ అక్క‌డ మోదీ రెండు ర్యాలీలు తీస్తున్నార‌ని, మ‌రి ఇవాళ్టి నుంచి ఎందుకు ప్ర‌చారంపై నిషేధం విధించ‌లేదు అని మాయా ప్ర‌శ్నించారు. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు అని, మోదీ క‌నుస‌న్న‌ల్లోనే ఈసీ ప‌నిచేస్తున్న‌ద‌ని ఆమె ఆరోపించారు.
*మల్లె సొంతగూటికి సాయిప్రతాప్
కడప జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ మరోసారి కాంగ్రెస్ లో చేరారు. యూపీఏలో హయాంలో రాజంపేట నుంచి లోక్ సభ కు ఎన్నికై కేంద్రంలో మంత్రిగా కూడా పని చేసిన సాయిప్రతాప్ కాంగ్రెస్ ఓటమి తర్వాత తెలుగుదేశంలో చేరారు. ఇటీవల ఎన్నికల్లో రాజంపేట టిక్కెట్ ఆశించి భంగపడ్డ సాయిప్రతాప్ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పారాయన. బలహీన వర్గాలకు కాంగ్రెస్ లోనే న్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎవరు అధికరంలోకు వచ్చినా ప్రత్యెక హోదా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ కే మద్దతివ్వాలని సూచించారు. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సాయిప్రతాప్ ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తునట్లు చెప్పారు.
*కాశీలో గుంతల రోడ్లు భలే ..ప్రియాంక సెటైర్లు
‘గంగాయాత్రతో ప్రచారం మొదలుపెట్టి వారణాసి వచ్చా. మోడీ పాలనలో కాశీ అద్భుతంగా ఉంటుందనుకున్నా. కానీ ఇక్కడి రోడ్లకున్న గుంతలు చూస్తే అర్థమవుతోంది బీజేపీ సర్కారు పనితీరేంటో’ అని కాంగ్రెస్‌‌ జనరల్‌‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. వాళ్ల అభివృద్ధి అడ్వర్టైజ్‌‌మెంట్స్‌‌లో బాగా కనబడుతుందని చురకలంటించారు. మోడీది మజ్బూత్‌‌ సర్కారు కాదని.. పొగరుబోతు (మగ్రూర్‌‌) సర్కారని విమర్శించారు. ఆ పొగరుబోతుతనం బీజేపీ పార్టీ నేతల మాటల్లో రోజూ కనబడుతూనే ఉంటుందన్నారు. హక్కుల కోసం పోరాడే వాళ్లను ‘యాంటీ నేషనల్‌‌’ అంటూ జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌‌లోని డియోరియాలో సలెంపూర్‌‌ కాంగ్రెస్‌‌ క్యాండిడేట్‌‌ రాజేశ్‌‌ మిశ్రాకు మద్దతుగా బుధవారం ప్రియాంక ప్రచారం చేశారు.
*బెంగాల్ కంటే కాశ్మీర్ బెట్టర్
పశ్చిమబెంగాల్లో కంటే జమ్మూకాశ్మీర్లో ఎన్నికలు శాంతియుతంగా జరుగుతున్నాయి. కాశ్మీర్లో పంచాయతీ ఎన్నికల సమయంలో ఒక్క పోలింగ్ బూత్లోనూ హింసాత్మక ఘటనలు జరగలేదు. అదే బెంగాల్పంచాయతీ ఎన్నికల్లో హింస వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల్లో గెలిచిన వారి ఇళ్లు తగలబెట్టారు. వారంతా జార్ఖండ్, ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సి వచ్చింది. వారు చేసిన తప్పు ఏమిటంటే పంచాయతీ ఎన్నికల్లో గెలవడమే’’అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బుధవారం ఓ జాతీయ న్యూస్ చానల్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని మోడీ.. బెంగాల్లో ఎన్నికల హింసకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న వారు, తటస్థులం అని చెప్పుకునే వారు బెంగాల్లో హింసపై మౌనంగా ఉంటున్నారని, ఇది చాలా ఆందోళనకరమైన విషయమని చెప్పారు. తనపై ద్వేషంతో వారు అన్నింటినీ క్షమించేస్తున్నారని, ఇది దేశానికి కొత్త సమస్యలను సృష్టిస్తోందని మోడీ అన్నారు.
* కౌంటింగ్‌ ఏజెంట్లకు వైఎస్సార్ సీపీ శిక్షణ
ఎన్నికల కౌంటింగ్‌ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేపట్టింది.
ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున లోక్‌సభ, శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు, ప్రధాన ఎన్నికల ఏజెంట్లకు శిక్షణా శిబిరం గురువారం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ శిక్షణా తరగతులకు ఆయా పార్లమెంటు జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజక వర్గాల ఎన్నికల పరిశీలకులు హాజరయ్యారు. విజయవాడలోని బందర్‌ రోడ్డు, డీవీ మానర్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది. మాజీ సీఎస్ అజయ్ కల్లం, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్, పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఏజెంట్ల విధులపై, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమం కొనసాగనంది. శిక్షణకు హాజరవుతున్న వారు విధిగా సమయపాలన పాటించాల్సి ఉంటుందని పార్టీ ఇప్పటికే సూచనలు పంపింది. ఈ శిక్షణా తరగతులకు ఆహ్వానితులతో పాటుగా చీఫ్‌ ఎన్నికల ఏజెంట్లు అంతా విధిగా హాజరు కావాలని, ఎవరికీ మినహాయింపు లేదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ నేతలకు ఇప్పటికే ఓ సర్యుర లర్‌ పంపిన విషయం విదితమే.
*ఈసీ నిర్ణయంపై భగ్గుమన్న తెదేపా
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ భగ్గుమంది.ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఏపీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. పోలింగ్‌ ముగిసిన నెల తర్వాత వైకాపా ఫిర్యాదు చేస్తే ముందూ..వెనుక ఆలోచించకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడమేంటని మండిపడ్డారు.
*జులై 5 తరువాతే జడ్పీ అధ్యక్షుల ఎన్నిక
రాష్ట్రంలో జడ్పీ పదవులకు ఎన్నికలు జులై 5వ తేదీ తరువాత నిర్వహించనున్నారు. ప్రస్తుత ఉమ్మడి జడ్పీ పాలకవర్గాల పదవీకాలం అప్పటి వరకు ఉండటమే ఇందుకు కారణం. మండల పరిషత్‌ అధ్యక్ష పదవులనూ జులై 4వ తేదీ తరువాత చేపడతారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ పాలకవర్గం తప్ప మిగతా 8 ఉమ్మడి జడ్పీల పాలకవర్గాల పదవీకాలం జులై 5వ తేదీతో ముగిస్తుంది. ఆ తరువాత మాత్రమే కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో తొలి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి బుధవారం ఇక్కడ స్పష్టం చేశారు.
*బెంగాల్‌లో గూండాస్వామ్యం
పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డెమోక్రసీని (ప్రజాస్వామ్యాన్ని) గూండాక్రసీ (గూండాస్వామ్యం)గా మార్చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. తృణమూల్‌ గూండాలు రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తున్నారని, ఈ ధోరణి ఇకపై ఎంతమాత్రం చెల్లదని స్పష్టంచేశారు. అధికారంలో కొనసాగే హక్కు మమతకు లేదన్నారు. కోల్‌కతాలో రాజకీయ హింస నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. బెంగాల్లో అత్యయిక పరిస్థితి తరహా వాతావరణాన్ని మమత తీసుకువచ్చారని, ప్రతీదీ నాశనం చేయడమే ఆమె లక్ష్యమని మోదీ ఆరోపించారు.
*దేశాన్ని ఒక్కరే నడిపించేస్తారా?
కేవలం ఒకే ఒక వ్యక్తి దేశాన్ని నడిపించగలరని ప్రధాని నరేంద్రమోదీ భావిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. వాస్తవానికి ఈ దేశాన్ని నడిపిస్తోంది ప్రజలేనని స్పష్టంచేశారు. ఐదేళ్ల క్రితం మన్మోహన్‌సింగ్‌ను ఉద్దేశించి మోదీ వెటకారంగా మాట్లాడేవారని, ఇప్పుడు ఆ పని చేయలేకపోతున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశమంతా మోదీని ఉద్దేశించి వెటకారంగా మాట్లాడుతోందని చెప్పారు. బుధవారం రాహుల్‌గాంధీ పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని బర్గాడీలో ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు.
*రాహుల్‌పై శిరోమణి అకాలీదళ్‌ ఆగ్రహం
గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అపవిత్రం చేసిన ఘటనతో ప్రమేయం ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ పేర్కొనడంపై భాజపా మిత్రపక్షం, శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపింది. పంజాబ్‌లో అమరీందర్‌సింగ్‌ ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రాహుల్‌గాంధీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించింది. 2015లో బర్గాడీలో గురుగ్రంథ్‌ సాహిబ్‌ గ్రంథాన్ని అపవిత్రం చేసిన ఘటన చోటుచేసుకుంది.
*హింసకు పాల్పడింది భాజపా గూండాలే
భాజపా నాయకులు, కార్యకర్తలు కోల్‌కతాలో హింసాకాండకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెదేపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆయన సంఘీభావం తెలిపారు. అలాగే భాజపా ఫిర్యాదులపై స్పందిస్తూ… తృణమూల్‌ కాంగ్రెస్‌ ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం విస్మరించడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ట్వీట్‌ చేశారు. ‘‘సీబీఐ, ఈడీలను ప్రయోగించి బెంగాల్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూశారు. వారి ఆటలు సాగకపోవడంతో ఇప్పుడు నేరుగా గూండాలతో హింసాకాండకు పాల్పడ్డారు. ఎన్నికల సమయంలో భయోత్పాతం సృష్టించడమే వాళ్ల లక్ష్యం. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను..’’ అని చంద్రబాబు ట్విటర్‌లో పేర్కొన్నారు.
*చంద్రగిరిలో 19న రీపోలింగ్‌
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని అయిదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కేంద్రాల్లో ఈ నెల 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి బుధవారం ఆదేశాలు జారీ చేసింది. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారి పల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, అక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గతంలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన ఎన్నికల అధికారులు భారత ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా రీపోలింగ్‌ చేపట్టాలని నిర్ణయం తీసుకున్న ఈసీఐ ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది.
*ఫిరాయింపుల నిరోధక చట్టం అమలుకు ఒత్తిడి తెస్తాం
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో తలపెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల పునరాకృతి, మిషన్‌ భగీరథ పేరుతో కేసీఆర్‌ రూ.లక్షల కోట్లు లూటీ చేస్తున్నారని విమర్శించారు.
*సీఎంగా మోదీ.. మాయని మచ్చ
గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పాలనలో సాగిన అరాచకాలు, మత ఘర్షణలు భాజపాకు, దేశానికి కూడా మాయని మచ్చగా మిగిలాయని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి విరుచుకుపడ్డారు. మోదీ ముఖ్యమంత్రిగానూ, ప్రధానమంత్రిగానూ పనికిరారని విమర్శించారు. ‘నేను ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు పనిచేశాను. అరాచకాలు, అల్లర్ల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాను.
*ముంపు బాధితులకు అండగా ఉంటాం: రేవంత్‌రెడ్డి
గజ్వేల్‌లోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ ముంపు బాధితులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఆయన కుమార్తె ఆశారెడ్డిలతో పాటు, రైతు కనకయ్యను బుధవారం రేవంత్‌ పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతుంటే వారి భూములను లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తన ఏడెకరాల భూమికి ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం తీసుకుంటుండటంతో రైతు కనకయ్య పురుగు మందు తాగాడని తెలిపారు.
*పోలింగ్‌ శాతం పెరుగుదల ఓ మతలబు: మర్రి శశిధర్‌రెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరగడం వెనక ఏదో మతలబు ఉందని మాజీమంత్రి, టీపీసీసీ ఎన్నికల కమిటీ కన్వీనర్‌ మర్రి శశిధర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పోలింగ్‌కు సంబంధించి తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఎన్నికల కమిషన్‌కు వివరాలు కావాలని అర్జీ పెట్టుకుంటే.. ఏ ఒక్కదానికీ సమాధానం ఇవ్వలేదని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
*సీఎంగా మోదీ.. మాయని మచ్చ
గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పాలనలో సాగిన అరాచకాలు, మత ఘర్షణలు భాజపాకు, దేశానికి కూడా మాయని మచ్చగా మిగిలాయని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి విరుచుకుపడ్డారు. మోదీ ముఖ్యమంత్రిగానూ, ప్రధానమంత్రిగానూ పనికిరారని విమర్శించారు. ‘నేను ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు పనిచేశాను. అరాచకాలు, అల్లర్ల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాను. కానీ మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానిగా పని చేసినప్పుడు అరాచకం, హింస, విద్వేషం చెలరేగిపోయాయి.
*దేశాన్ని ఒక్కరే నడిపించేస్తారా?
కేవలం ఒకే ఒక వ్యక్తి దేశాన్ని నడిపించగలరని ప్రధాని నరేంద్రమోదీ భావిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. వాస్తవానికి ఈ దేశాన్ని నడిపిస్తోంది ప్రజలేనని స్పష్టంచేశారు. ఐదేళ్ల క్రితం మన్మోహన్‌సింగ్‌ను ఉద్దేశించి మోదీ వెటకారంగా మాట్లాడేవారని, ఇప్పుడు ఆ పని చేయలేకపోతున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశమంతా మోదీని ఉద్దేశించి వెటకారంగా మాట్లాడుతోందని చెప్పారు. బుధవారం రాహుల్‌గాంధీ పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని బర్గాడీలో ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు.
*ప్రజాస్వామ్యం అపహాస్యం: కన్నా
తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కోల్‌కతాలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై జరిగిన దాడికి నిరసనగా విజయవాడ ధర్నాచౌక్‌లో బుధవారం ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. హింస ద్వారా ఎన్నికల్లో గెలుపొందాలని పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
*ఓట్ల లెక్కింపుపై వైకాపా శిక్షణ శిబిరం నేడు
ఓట్ల లెక్కింపు (కౌంటింగ్‌)పై వైకాపా గురువారం విజయవాడలోని ఒక కన్వెన్షన్‌ సెంటర్‌లో శిక్షణ శిబిరం నిర్వహించనుంది. ఆ పార్టీకి చెందిన లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ప్రధాన ఓట్ల లెక్కింపు ఏజెంట్లు, లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులకు ఈ శిబిరంలో శిక్షణ నివ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిక్షణ కొనసాగనుంది.
*వైకాపా వస్తే ఐపాక్‌కు కీలక బాధ్యతలు!
వైకాపా అధికారంలోకొస్తే ఐ-పాక్‌ (ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ)కు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన సంస్థనే ఐ-పాక్‌. గత నెల 11న రాష్ట్రంలో పోలింగ్‌ ముగిశాక హైదరాబాద్‌లో ఐ పాక్‌ కార్యాలయానికి వెళ్లిన జగన్‌ అక్కడ ప్రశాంత్‌ కిషోర్‌తోపాటు, ఆయన బృంద సభ్యులతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటయితే సహకారం కొనసాగించాలని ఆయన అన్నట్లు అప్పట్లోనే వార్తలొచ్చాయి.
*రాజద్రోహం చట్టాన్ని కఠినతరం చేస్తాం: రాజ్‌నాథ్‌
తాము అధికారంలోకి వస్తే రాజద్రోహం చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పేర్కొనడాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ దుయ్యబట్టారు. భాజపా మళ్లీ అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని మరింత కఠినంగా రూపొందిస్తామన్నారు. ఆ చట్టం పేరు చెబితేనే భయం పుట్టేలా దాన్ని కఠినతరం చేస్తామన్నారు.
*బెంగాల్‌ హింసకు మోదీ, షాలే కారణం
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రోడ్‌ షో సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింసకు ప్రధాని మోదీ, అమిత్‌షాలే కారణమని తెదేపా నేత భవనం భూషణ్‌రెడ్డి ఆరోపించారు. ఉండవల్లిలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. అమిత్‌ షా విద్వేషపూరిత వ్యాఖ్యలను తెదేపా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. దేశంలోని ప్రాంతీయపార్టీలను కబళించాలని మోదీ, షాల ద్వయం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందని విమర్శించారు. 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సీఎం చంద్రబాబుతో ఎందుకు పెట్టుకున్నామా అని మోదీ, షాలు బాధపడే పరిస్థితి వస్తుందన్నారు.
*అందరికి చేయూతనిస్తా-జగన్
తానె ముఖ్యమంత్రిని అవుతానని ప్రజానీకానికి అండగా నిలుస్తానని వైకాపా అధినేత వై.ఎస్.జగన్ హామీ ఇచ్చారు. కడప జిల్లా పులివెందులలో రెండు జిల్లాల పర్యటనలో భాగంగా తొలిరోజైన బుధవారం ప్రజదర్భారు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు జగన్ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. కడపతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన వైకాపా శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరికి చేయూతనందిస్తానని ఈ సందర్భంగా జగన్ భరోసా ఇచ్చారు. వైకాపా ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషా కోరముట్ల శ్రీనివాసులు రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి తదితరులు జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. పులివెందులలోని స్థానిక వీజే ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లీం సోదరులతో కలిసి జగన్ ఇరవై నిముషాల పాటు నమాజ్ చేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. గురువారం కూడా స్థానిక తన కార్యాలయంలో జగన్ ప్రజలకు అందుబాటులో ఉన్తరని౮ వైకపా నాయకులూ తెలిపారు.
* కౌంటిం ఏజెంట్లకు వైఎస్సార్ సీపీ శిక్షణ
ఎన్నికల కౌంటింగ్‌ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేపట్టింది. ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున లోక్‌సభ, శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు, ప్రధాన ఎన్నికల ఏజెంట్లకు శిక్షణా శిబిరం గురువారం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ శిక్షణా తరగతులకు ఆయా పార్లమెంటు జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజక వర్గాల ఎన్నికల పరిశీలకులు హాజరయ్యారు. విజయవాడలోని బందర్‌ రోడ్డు, డీవీ మానర్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది. మాజీ సీఎస్ అజయ్ కల్లం, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్, పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఏజెంట్ల విధులపై, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమం కొనసాగనంది. శిక్షణకు హాజరవుతున్న వారు విధిగా సమయపాలన పాటించాల్సి ఉంటుందని పార్టీ ఇప్పటికే సూచనలు పంపింది. ఈ శిక్షణా తరగతులకు ఆహ్వానితులతో పాటుగా చీఫ్‌ ఎన్నికల ఏజెంట్లు అంతా విధిగా హాజరు కావాలని, ఎవరికీ మినహాయింపు లేదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ నేతలకు ఇప్పటికే ఓ సర్యుడి లర్‌ పంపిన విషయం విదితమే.