టానా టోరాజా ప్రాంతంలో దాదాపు 2.3లక్షల జనాభా ఉన్నట్లు సమాచారం. ఇక్కడి టోరాజా తెగ ప్రజలు పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయాలను తూచ తప్పకుండా పాటిస్తుంటారు. పర్వదినాలు, వివాహాది శుభకార్యాలకన్నా.. అంతిమ సంస్కారాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఈ క్రమంలోనే అంత్యక్రియలను ఓ పండుగలా నిర్వహిస్తుంటారు. ఎవరైనా చనిపోతే వారి కోసం ఇంట్లోనే ఒక ప్రత్యేక గదిని నిర్మించి అందులో మృతదేహాన్ని ఉంచుతారు. పండుగ చేయడానికి సరిపడ డబ్బులు సమకూరే వరకు మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించరు. దీనికి ఎంతకాలమైనా పట్టొచ్చు. అప్పటి వరకు అసలు మృతులను మృతి చెందినట్లుగానే పరిగణించరు. అనారోగ్యంగా ఉన్నారనో.. విశ్రాంతి తీసుకుంటున్నారనో భావిస్తారట. వారి కోసం ప్రతి రోజు భోజనం ఏర్పాట్లు చేస్తారు. మృతదేహం భోజనం చేయదు. కానీ, సంప్రదాయం ప్రకారం అలా నైవేద్యంలా పెడుతుంటారట.
అక్కడ చితిమంటలే ఒక పర్వదినం
Related tags :