NRI-NRT

జర్మనీలో ఉగాది వేడుకలు

జర్మనీలో ఉగాది వేడుకలు - Ugadi in Germay By Samaikhya Telugu Vedika

సమైక్య తెలుగు వేదిక(ఎస్‌టీవీ) ఆధ్వర్యంలో జర్మనీలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్టుట్‌గార్ట్‌లో జరిగిన శ్రీ వికారి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలలో దాదాపు 200మందికి పైగా తెలుగు వారు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, వడపప్పు, పానకం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు, పెద్దలు తమ ప్రదర్శనలతో ఆహుతులను ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ సమైక్య తెలుగు వేదిక టీమ్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్‌ స్టుట్‌గార్ట్‌లో నివాసముంటున్న తెలుగువారు సమైక్యంగా తెలుగు సాంస్కృతిని వ్యాప్తి చేస్తూ, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలని పేర్కొన్నారు.

Ugadi 2019 In Germany By Samaikya Telugu Vedika (STV e.V.) Stuttgart Germany

Samaikya Telugu Vedika e.V. (STV e.V.) (Telugu association) organized Ugadi celebrations (Vikari nama samvastara vedukalu) on 4th of May 2019. Approximately, 200 people around Stuttgart area celebrated together. People have enjoyed the cultural dances along with our traditional games (Thokkudu billa, goleelu, rings game, etc). STV team says thanks to all the participants and people who supported in organizing the event. STV is trying to bring the all the telugu people in greater Stuttgart area to promote telugu culture and also help the community here. 

For more details, please visit 

www.stvgermany.de
www.facebook.com/groups/stvgermany