అన్నవరం దేవస్థానంలో ఆన్‌లైన్ వ్రత పూజను లాంఛనంగా ప్రారంభించారు.
కరోనా నేపథ్యంలో ఆలయానికి వచ్చి స్వామి సన్నిధిలో ప్రత్యక్షంగా వ్రత పూజ చేయించుకునే అవకాశం లేని భక్తులకు పరోక్ష పద్దతిలో ఆన్‌లైన్ ద్వారా వ్రత పూజను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఆన్‌లైన్ ద్వారా దేవస్థానానికి రూ. 1,116 రుసుము చెల్లించే భక్తులకు వ్రత పూజను యూట్యూబ్ లింక్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు.
రుసుము చెల్లించే వారి గోత్ర, నామాలతో జరిగే పూజను ఆన్‌లైన్ ద్వారా వీక్షించే అవకాశంతో పాటు, పురోహితులు సూచించే విధంగా ఇంట్లో కూడా వ్రతం చేసుకునే అవకాశం ఉంటుంది.