NRI-NRT

వచ్చే శనివారం 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

వచ్చే శనివారం 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

సాహితీ మిత్రులందరికీ వందనాలు.
రాబోయే శని, ఆది వారాలలో ..అనగా అక్టోబర్ 10-11, 2020 లలో జరుగుతున్న 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకి సర్వం సిధ్ధం అయింది. తొలి ప్రకటన కే దేశదేశాల వక్తల నుంచి వచ్చిన అనూహ్యమైన స్పందన దృష్ట్యా ముందుగా అనుకున్న 24 గంటల నిర్విరామ సదస్సుని మరొక 8 గంటల సమానాంతర వేదిక ద్వారా పొడిగించి 15 ప్రసంగ వేదికలలొ సుమారు 175 మంది వక్తల ప్రసంగాలకి అవకాశాలు కల్పించాం. మరొక 30 మంది త్వరలోనే నిర్వహించే సదస్సు విజయోత్సవాలలో ప్రసంగించి ఈ చారిత్రాత్మక సాహితీ సదస్సు కి సముచితమైన ముగింపు పలుకుతారు.
ఈ సదస్సు లో చోటు చేసుకునే అత్యంత ఆసక్తికరమైన వివరాలు పొందుపరచబడిన సమగ్ర ప్రకటన ఇందుతో జతపరిచాం. వక్తలూ, ప్రసంగాంశాలూ, విజయోత్సవాలలో ప్రసంగించే వారి వివరాలూ త్వరలోనే ప్రకటిస్తాం.
అనేక దేశాలల లో నివశిస్తున్న 25 మంది సాంకేతిక నిపుణులు, 20 మంది వేదిక నిర్వాహకులు రూప కల్పన చేసిన ఈ 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు 32 గంటల నిర్విరామ ప్రత్యక్ష ప్రసారాన్ని ని మీకు ఉచితంగా, మీ ఇంట్లోనే హాయిగా కూర్చుని ఈ క్రింది లింకులలో చూసి ఆనందించమని కోరుతున్నాం.
సదస్సు ప్రారంభ సమయాలు
అక్టోబర్ 10, 2020, శనివారం (GMT: 8:00 AM- 12:00 Noon)
Houston, USA: 3:00 am CDT; London, U.K: 9:00 am BST
Johannesburg, South Africa: 10:00 am SAST; Hyderabad, India: 1:30 pm IST
Singapore: 4:00 pm SGT; Melbourne, Australia: 7:00 pm AEDT
24 గంటల సేపు నిర్విరామంగా, 8 గంటలు సమానాంతరంగా వెరసి 32 గంటల తెలుగు సాహిత్య పరిమళం.
Please copy and paste the links in your URL only during the above times, at any time.
YouTube Links:
https://bit.ly/3is8lsy,
https://bit.ly/2EUJEHo
Facebook Links:
https: //bit.ly/3iyFUcE,
https://bit.ly/3itifu3,
https://bit.ly/2EWVL6R

భవదీయులు,
7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం
వంగూరి చిట్టెన్ రాజు
E-mail: vangurifoundation@gmail.com; వాట్సాప్: + 1 832 594 9054
కవుటూరు రత్న కుమార్ (సింగపూర్); రావు కొంచాడ (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా), డా. జొన్నలగెడ్డ మూర్తి (లివర్ పూల్, ఇంగ్లండ్); రాపోలు సీతారామ రాజు (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా), వంశీ రామరాజు (భారత దేశం), శాయి రాచకొండ (హ్యూస్టన్, అమెరికా)