* బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు!
* గాజువాక వాంబే కాలనీలో దారుణం .పదహారేళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం .పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబ సభ్యులు .నిందితుడు నానిబాబు అలియాస్ హెవెల్‍ను అదుపులోకి తీసుకున్న పోలీసులు .
* గుంటూరు జిల్లా చనిపోతాను అంటూ రైల్వే స్టేషన్ కి వచ్చిన మహిళను కాపాడిన రైల్వే సిబ్బంది.తనకు ఎవరూ లేరంటూ తనను చూసే వారే కరువయ్యారు అంటూ గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన ఓ మహిళ ఈరోజు కొద్దిసేపటి క్రితం పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ చేరుకొని తాను రైలు కింద పడి చనిపోతాం అంటూ రైలు ఎప్పుడు వస్తుంది అని రైల్వే పట్టాలపై కొంతసేపు హల్చల్ చేయడంతో స్పందించిన పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ అధికారులు సిబ్బంది ఆమెను ఆప్యాయతగా అదుపులోకి తీసుకొని స్టేషన్లో ప్రస్తుతం కూర్చోబెట్టారు.బంధువులు స్పందించాలని కోరుతున్నారు ప్రమాదం నుంచి కాపాడిన పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ అధికారులను సిబ్బందిని అక్కడ ఉన్నవారు అభినందించారు.అలానే తనది మోర్జంపాడు గ్రామం అని తన పేరు లక్ష్మమ్మ అని ఆమె రైల్వే అధికారులకు తెలిపినట్టు సమాచారం.
* ఏపీ పోలీసులపై అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయని ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదిక సరైంది కాదని టెక్నికల్ డీఐజీ పాల్‌రాజు అన్నారు.
* ఉరవకొండ పట్టణంలోని 3వ వార్డు సచివాలయం పరిధిలో పింఛన్ల సొమ్ముతో పరారైన వలంటీర్‌ను ఎట్టకేలకు విధుల నుంచి తొలగించారు.
* స్వర్ణ ప్యాలస్ అగ్నిప్రమాద సంఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను 10 మందికి, గాయపడిన వ్యక్తికి 50 వేల రూపాయల చెక్కును పంపిణి చేసిన జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి యం.వెంకటేశ్వర్లు.
* షోపియన్‌లోని సుగన్ జైనాపొర ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది.
* 16 నిమిషాలకు ఓ రేప్భారత్ లో ప్రతి 16 నిమిషాలకు ఒక అత్యాచారంజరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB)వెల్లడించింది. మహిళలు,బాలికలకు ఏ రాష్ట్రమూసురక్షితం కాదని వ్యాఖ్యానించింది. 2018లోపోలిస్తే 2019లో మహిళలపై నేరాలు 7.3%పెరిగాయని, గతేడాది మొత్తం 4,05,861 కేసులునమోదయ్యాయని పేర్కొంది. 2019లో దేశవ్యాప్తంగా32,033 రేప్ కేసులు నమోదైతే అందులో 11%దళిత వర్గాల్లోనే జరిగాయంది. అటు నేరాల్లో UPఅగ్రస్థానంలో ఉంది.
* మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కొరమలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు. విగ్రహాన్ని పెకిలించి వేసి దుండగులు కిందపడేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
* రామలింగేస్వ ర స్వామి దేవాలయం పై ఏసీబీ అధికారుల దాడి సీనియర్ అసిస్టెంట్ 20 వేల రూపాయలు లంచం తీసుకొంటూ ఉండగా రెడ్ హాండ్ గా పెట్టుకొన్న ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు.