తిరుచానూరులో వీఐపీ సేవలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 1 నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ప్రారంభించనున్నట్లు ఆలయ ప్రత్యేక డిప్యూటీ ఈవో ముణిరత్నం రెడ్డి తెలిపారు. సోమవారం తిరుచానూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తరహాలో తిరుచానూరులో కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనం ప్రవేశపెట్టాలని తితిదే పాలకమండలి నిర్ణయించిందన్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రాత్రి 7:00 నుంచి 7:30 గంటల వరకు వీఐపీ దర్శన సమయంగా కేటాయించామన్నారు.వీఐపీ దర్శనం పరిధిలోకి వచ్చే ప్రముఖులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రొటోకాల్‌ పరిధిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ టికెట్లు కేటాయిస్తామన్నారు. రానున్న రోజుల్లో అమ్మవారి ఆర్జితసేవ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి కుంకుమార్చన సేవా సమయాన్ని మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు యథావిధిగా కొనసాగిస్తామన్నారు. అమ్మవారి దర్శన వేళల సమయాన్ని మరో గంటపాటు అదనంగా పొడిగించామన్నారు. ఉదయం 4:30 గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 9:30 గంటలకు మూసివేస్తామని వెల్లడించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com