Sports

నాదల్ విజయ నినాదాల్

నాదల్ విజయ నినాదాల్

ఎర్రమట్టి కోర్టులో మరోసారి రఫెల్‌ నాదెల్ విజయకేతనం ఎగురవేశాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో నొవాక్‌ జకోవిచ్‌పై 6-0, 6-2; 7-5 తేడాతో విజయం సాధించి టైటిల్ గెలిచాడు. తొలిసెట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన అతడు రెండో సెట్‌లోనూ జకోవిచ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇక హోరాహోరీగా సాగిన మూడో సెట్‌లో పైచేయి సాధించి టైటిల్‌ సాధించాడు. దాంతో ఈ టోర్నీలో నాదల్ చేతిలో జకోవిచ్‌ మూడుసార్లు ఓటమి చవిచూశాడు. అయితే ఈ విజయంతో నాదల్‌ 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఫెదరర్‌ సరసన నిలిచాడు.