Business

అసలు ఏమిటీ TRP గోల?

అసలు ఏమిటీ TRP గోల?

డబ్బులిచ్చి టీవీ చానళ్ల టీఆర్పీ పెంచడానికి ప్రయత్నించిన ఒక రాకెట్‌ గుట్టు బయటపెట్టామని ముంబయి పోలీసులు చెబుతున్నారు.
ముంబయి పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం ఇప్పటివరకూ ఇందులో మూడు చానళ్లు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.రిపబ్లిక్ టీవీ పేరు బయటపెట్టిన పోలీసులు అది టీఆర్పీ సిస్టమ్‌ను టాంపరింగ్ చేసిందని చెప్పారు. అయితే రిపబ్లిక్ టీవీ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది.కానీ, వీటన్నిటి మధ్యా అసలు టీఆర్పీ అంటే ఏమిటి, టెలివిజన్ చానళ్లకు అది ఎందుకు అంత ముఖ్యం అనే ప్రశ్న కూడా వస్తుంది.టీఆర్పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్స్. ఇది ఒక ప్రత్యేకమైన టూల్.
దీని ద్వారా ఏ కార్యక్రమం లేదా ఏ చానల్‌ను జనం ఎక్కువగా చూస్తున్నారో అంచనా వేయవచ్చు. వీటితో ప్రజల ఇష్టాలను తెలుసుకోడానికి వీలవుతుంది. టీఆర్పీకి టీవీలో చూపించే కార్యక్రమాలకు నేరుగా సంబంధం ఉంటుంది.
ఈ రేటింగ్స్ వల్ల కంపెనీలు, ప్రకటనలు ఇచ్చే ఏజెన్సీలకు ప్రయోజనం లభిస్తుంది.
ఏ కార్యక్రమం వచ్చే సమయంలో తమ ప్రకటనలను జనం ఎక్కువగా చూడవచ్చో తెలుసుకోడానికి వారికి ఈ రేటింగ్స్ సహకరిస్తాయి.అంటే ఒక కార్యక్రమం లేదా టీవీ చానల్ రేటింగ్‌లో అన్నిటికంటే ముందుంటే దానికి ఎక్కువ ప్రకటనలు వస్తాయి. అంటే ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది.అయితే 2008లో ట్రాయ్ టెలివిజన్ ఆడియన్స్ మెజర్‌మెంట్‌కు సంబంధించి కొన్ని సిఫారసులు చేసింది.వీటి ప్రకారం ప్రకటనలు ఇచ్చేవారికి తమ డబ్బుకు తగిన పూర్తి ప్రయోజనం లభించేలా రేటింగ్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.కానీ, టెలివిజన్, చానళ్ల కార్యక్రమాల ప్రాధాన్యాన్ని నిర్ధారించడానికి ఇవి ఒక బెంచ్‌మార్క్‌గా మారాయి.
**ఈ టెలివిజన్ రేటింగ్స్ ఎవరిస్తారు
*2008లో టామ్ మీడియా రీసెర్చ్(టామ్), ఆడియో మెజర్‌మెంట్ అండ్ అనలిటిక్స్ లిమిటెడ్(ఎఎంఏపీ) టీఆర్పీ రేటింగ్స్ ఇచ్చేవి.
*టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా( ట్రాయ్) వివరాల ప్రకారం ఈ రెండు ఏజెన్సీల పని కొన్ని పెద్ద నగరాల వరకే పరిమితమై ఉండేది. ఆడియన్స్ మెజర్‌మెంట్ కోసం పానల్ సైజ్ కూడా పరిమితంగా ఉండేది.
*ట్రాయ్ అదే ఏడాది దీనికోసం ఇండస్ట్రీ ప్రతినిధుల నేతృత్వంలో స్వీయ నియంత్రణ కోసం బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) ఏర్పాటు చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది.
*ఆ తర్వాత 2010 జులైలో బార్క్ ఉనికిలోకి వచ్చింది. అయితే, ఆ తర్వాత టామ్ కూడా టెలివిజన్ రేటింగ్ ఇవ్వడం కొనసాగించింది. అయితే ఏఎంఏపీ ఆ పని ఆపివేసింది.
*ఈలోపు ఈ అంశంపై చాలా చర్చలు నడిచాయి. 2014 జనవరిలో టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2015 జులైలో భారత్‌లో టెలివిజన్ రేటింగ్ ఇవ్వడానికి బార్క్ గుర్తింపు పొందింది.
*టామ్ సమచార మంత్రిత్వ శాఖలో దీనికోసం రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి, అది ఆ పనిని ఆపివేసింది. దాంతో బార్క్ బారత్‌లో టెలివిజన్ రేటింగ్స్ ఇచ్చే ఏకైక ఏజెన్సీ అయ్యింది.
*ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ , అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బార్క్ ఇండస్ట్రీ ప్రతినిధులుగా ఉన్నాయి.
*ఒకటి- ఇళ్లలో ఉన్న టెలివిజన్‌లో ఏం చూస్తున్నారో తెలుసుకోడానికి భారీ స్థాయిలో సర్వే నిర్వహిస్తారు. దానికోసం టీవీకి ఒక ప్రత్యేక మీటర్ ఏర్పాటుచేస్తారు. అది టెలివిజన్‌లో వారు ఏయే చానళ్లు చూస్తున్నారో, ఆ వివరాలను నమోదు చేస్తుంది.
*రెండోది- జనం ఏది ఎక్కువగా చూడ్డానికి ఇష్టపడుతున్నారో తెలుసుకోడానికి రెస్టారెంట్లు, హోటళ్లలో ఉన్న టీవీ సెట్ల నుంచి వారు ఏ చానల్, ఏ కార్యక్రమం చూస్తున్నారు అనే డేటాను సేకరిస్తారు.
**ప్రస్తుతానికి దేశంలోని 44 వేల ఇళ్ల నుంచి టీవీ కార్యక్రమాల డేటా సేకరిస్తున్నారు. 2021 నాటికి ఈ టార్గెట్ పానెల్‌ను 55 వేల ఇళ్లకు పెంచాలని బార్క్ ప్రయత్నిస్తోంది. అటు రెస్టారెంట్లు, షాపుల్లో మొత్తం శాంపిల్ సైజ్ 1050గా ఉంది.
సేకరించిన మొత్తం డేటా ద్వారా తేల్చిన గణాంకాలను అది ప్రతి వారం విడుదల చేస్తుంది.రేటింగ్‌- ప్రకటనల సంబంధం
ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్‌లో 130 కోట్ల మంది ఉన్నారు. దేశంలో 19.5 కోట్లకు పైగా టెలివిజన్ సెట్లు ఉన్నాయి.నిపుణులు భారత్‌ను ఒక పెద్ద మార్కెట్‌గా చెబుతున్నారు. అందుకే ప్రజల వరకూ చేరుకోడానికి కంపెనీలకు ప్రకటనలు చాలా కీలకం.ఫిక్కీ(FICCI) ఒక రిపోర్ట్ ప్రకారం 2016లో భారత్‌లో ప్రకటనల వల్ల టెలివిజన్ చానళ్లకు 243 బిలియన్ల ఆదాయం లభించింది. అటు సబ్‌స్క్రిప్షన్ వల్ల 90 బిలియన్లు లభించాయి. ఈ ప్రకటనల ఆదాయం 2020లో 368 బిలియన్లకు పెరిగితే, సబ్‌స్క్రిప్షన్లు 125 బిలియన్లకు చేరాయి.