NRI-NRT

ఖతార్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరించిన కవిత

Kavitha Launches Qatar Batukamma 2020 Poster By Telangana Jagruti Qatar

తెలంగాణ జాగృతి ఖతర్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో ఈ యేడు నిర్వహించనున్న ఖతర్ మహ బతుకమ్మ పోస్టర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈ సారి ఖతర్ ప్రభుత్వ కోవిడ్ నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో ఆడపడుచులు బతుకమ్మలో పాల్గొంటారని కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేలా రూపకల్పన చేశామని అన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, బిక్షపతి స్వామి, పసుల చరణ్, ఖతర్ నుండి నర్సయ్య దోనికేని, కో ఆర్దిడినేటర్ అభిలాష్ బండి తదితరులు పాల్గొన్నారు.