Movies

ఇద్దరితో సముద్రంలో…

ఇద్దరితో సముద్రంలో…

ఇద్దరు హీరోలతో కలిసి సందడి చేయబోతోంది… అదితిరావు హైదరీ. అటు అందంతోనూ, ఇటు అభినయంతోనూ ఆకట్టుకుంటున్న ఈ నాయిక ‘మహాసముద్రం’ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది.అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో కథానాయిక పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంది. నటనకి అవకాశమున్న ఆ పాత్ర కోసం పలువురి నాయికల్ని పరిశీలించిన అనంతరం అదితిరావు హైదరీ పేరుని ఖరారు చేసినట్టు చిత్రబృందం తెలిపింది.