బాలీవుడ్ నటి రియా చక్రవర్తి సీబీఐకి లేఖ రాశారు. సుశాంత్ మృతి కేసులో తనపై తప్పుడు సమాచారం ఇచ్చి దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన పొరుగున ఉండే డింపుల్ తవానీ అనే మహిళ దర్యాప్తు అధికారులను తప్పుదోవపట్టించేలా స్టేట్‌మెంట్ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. సుశాంత్ మరణానికి ముందు రోజే (జూన్ 13న) రియాను ఆమె నివాసం వద్ద వదిలి వెళ్లినట్టు డింపుల్ ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తనకు తాను ప్రత్యక్ష సాక్షిగా పేర్కొంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో రియా కోరారు. ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేలా తనపై లేనిపోని అబద్ధాలు చెప్పారని, ఆరోపణలు చేశారని లేఖలో తెలిపారు. అయితే, ఈ ఘటనపై దర్యాప్తు అధికారుల్ని తప్పుదోవ పట్టించేలా సమాచారం ఇచ్చిన వారి జాబితాను తయారు చేస్తామని రియా తరఫు న్యాయవాది తెలిపారు. ఆ జాబితాను ఆధారాలతో సహా సీబీఐ అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు.
చర్యలు తీసుకోవాలని చక్రవర్తి లేఖలు
Related tags :